First 360 Degrees Film : ఇటీవలే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘పులి వచ్చింది మేక సచ్చింది’. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రపంచపు తొలి 360 డిగ్రీల చిత్రంగా రిలీజైన ఈ సినిమా సరికొత్త స్క్రీన్ ప్లేతో ఆకట్టుకుంటోంది. ప్రస్థానం మార్క్స్ పతాకం పై నిర్మాత భవానీ శంకర్ కొండోజు నిర్మాణంలో అ శేఖర్ యాదవ్ ఈ సినిమాను రూపొందించారు.
జయలలిత, చిత్రం శ్రీను, ఆనంద్ భారతి, గోవర్థన్ రెడ్డి, నిహారిక రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన ‘పులి వచ్చింది మేక సచ్చింది’ సినిమా ఈ నెల 17న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాటు రిలీజైంది. మొదటి రోజు థియేటర్ లు ఎక్కువగా దొరకకున్నా, సినిమా బాగుందనే మౌత్ టాక్ తో థియేటర్ సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు దర్శకుడు అ శేఖర్ యాదవ్. కొత్త తరహా సినిమా తీస్తే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారనే మాట తమ సినిమా విషయంలో నిజమైందని ఆయన అంటున్నారు.
యోగి, వర్ష, మను, ఆ శేఖర్ యాదవ్, చందు, సుజిత్, శంకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం సుభాష్ ఇషాన్, డైలాగ్స్ – నాత్మిక, సినిమాటోగ్రఫీ – కిరణ్ కుమార్ దీకొండ, ఎడిటర్ – శ్రీనివాస్ అన్నవరపు, ఆర్ట్ – అడ్డాల పెద్దిరాజు, కాస్ట్యూమ్స్ – సండ్ర శ్రీధర్, ఆడియోగ్రఫీ – రంగరాజు, సౌండ్ డిజైన్ – రఘునాథ్ కామిశెట్టి, సౌండ్ ఎఫెక్ట్స్ – యతిరాజ్, నిర్మాత – భవానీ శంకర్ కొండోజు, రచన – దర్శకత్వం – శేఖర్ యాదవ్
Also Read : మంట కలిసిన మానవత్వం