Sundaram First Single: నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ `అంటే సుందరానికి`. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చారు. ఈ సందర్భంగా మొదటి సింగిల్ పంచెకట్టును ఏప్రిల్ 6న సాయంత్రం 6:03 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో నాని, తన విదేశీ పర్యటన USAలోని సుందరమైన లొకేషన్‌లను ఆస్వాదిస్తూ, కారు డోర్ లోంచి తల బయట పెట్టుకుని ఆశ్చర్యంగా పైకి చూస్తూ నవ్వుతూ కనిపించాడు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఇప్పటికే ఈ సినిమా టీజర్‌కు ట్రెమండస్ రెస్సాన్స్ వచ్చింది. నాని సరసన నజ్రియా నజీమ్ కథానాయికగా నటిస్తోంది ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు లీలా థామస్. ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్‌గా నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహించారు. అంటే సుందరానికి జూన్ 10న థియేటర్లలో విడుదల కానుంది.