Saturday, April 20, 2024
Homeసినిమాబుధవారం 'వాల్తేర్ వీరయ్య' ఫస్ట్ సింగిల్ రిలీజ్

బుధవారం ‘వాల్తేర్ వీరయ్య’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వాల్తేర్ వీరయ్య’. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ సాంగ్ నవంబర్ 23న సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది. ఊర మాస్ పోస్టర్ ద్వారా మేకర్స్ ఫస్ట్ సింగిల్ అనౌన్స్ మెంట్ చేశారు. చిరంజీవి గళ్ళ లుంగీలో కనిపించి చాలా కాలం అయ్యింది. ఈ చిత్రంలో ముఖ్యంగా ఈ పార్టీ నంబర్‌ లో మెగాస్టార్ వింటేజ్ మాస్ అవతార్‌ ని చూడటానికి అభిమానులు ఎంతో ఉత్సాహంగా వున్నారు. పోస్టర్ లో చిరంజీవి గెటప్, హావభావాలు మెగాస్టార్ ముఠా మేస్త్రి, మరికొన్ని మాస్ డ్యాన్స్‌ల జ్ఞాపకాలను గుర్తుకు తెస్తోంది.

కలర్ ఫుల్ చొక్కా లుంగీ ధరించి.. మెడలో బంగారం గొలుసులు, చెవి పోగు, చేతికి గడియారం, బ్లాక్ బూట్స్.. ఇలా మాస్ అప్పీరియన్స్ లో ఫ్యాన్స్ ని ఫిదా చేశారు మెగాస్టార్. ఈ పాటలో చిరంజీవి సరసన ఊర్వశి రౌతేలా సందడి చేయనుంది. మాస్ డ్యాన్స్ నంబర్ ‌లను స్కోర్ చేయడంలో నిపుణుడైన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మరో ఫుట్ ట్యాపింగ్ ట్రాక్‌ను కంపోజ్ చేశారు. పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో మాస్ మహారాజా రవితేజ కనిపించబోతున్నారు. ఇద్దరు స్టార్స్‌ని కలిసి తెర పై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటివలే విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత. నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌ లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్