Saturday, June 13, 2026
Homeసినిమా25న 'టాప్ గేర్' ఫస్ట్ సింగిల్

25న ‘టాప్ గేర్’ ఫస్ట్ సింగిల్

వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఇప్పుడు మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో వస్తున్నాడు. ఈ చిత్రానికి కె.శశికాంత్ దర్శకత్వం వహిస్తుండగా  ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘వెన్నెల వెన్నెల’ పాటను ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో K. V. శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్రలు కీలక పాత్రలలో నటిస్తుండగా హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరు 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే కథాకథనాలతో రాబోతున్న ఈ సినిమా పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను అలరించబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular