Wednesday, March 12, 2025
Homeసినిమా#BoyapatiRAPO ఫస్ట్ థండర్ కు ట్రెమండస్ రెస్పాన్స్

#BoyapatiRAPO ఫస్ట్ థండర్ కు ట్రెమండస్ రెస్పాన్స్

రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ రోజు రామ్ పుట్టినరోజు ప్రత్యేక సందర్భంగా ఫస్ట్ థండర్ విడుదలైంది. రామ్ తనదైన శైలిలో మాస్ ఎంట్రీ ఇస్తూ సదర్ పండుగ కు ఒక పెద్ద ఎద్దుని తీసుకువస్తాడు. అక్కడ గూండాల గ్యాంగ్ తో మాసివ్ ఫైట్ చేస్తాడు.ప్రతి ఫ్రేమ్‌ లో బోయపాటి స్టాంప్ ఉంది. రామ్ తన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ తో అదనపు బలాన్ని తీసుకువచ్చారు.

“నీ స్టేట్ దాటలేనన్నావ్ దాటా… నీ గేటు దాటలేనన్నావ్ దాటా… నీ పవర్ దాటలేనన్నావ్ దాటా… ఇంకేంటి దాటేది నా బొంగులో లిమిట్స్…” అనే డైలాగ్ అభిమానులను, మాస్ ని మెప్పిస్తుంది. శ్రీలీల ని కూడా వీడియోలో చూడవచ్చు. సంతోష్ డిటాకే తన ఎక్స్టార్డినరీ కెమెరా పనితనం తో ఆకట్టుకున్నాడు. ఎస్ఎస్  థమన్ తన థండర్స్ తో కూడిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ తో విజువల్స్‌ ను ఎలివేట్ చేశాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై అత్యున్నతమైన సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌ తో నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌  తమ్మిరాజు. మొత్తానికి ఫస్ట్ థండర్ మాస్ ని ఉర్రూతలూగిస్తోంది. #BoyapatiRAPO దసరా కానుకగా అక్టోబర్ 20న హిందీ, అన్ని దక్షిణ భారత భాషల్లో విడుదల కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్