Friday, March 29, 2024
HomeTrending Newsమత్య్స ఎగుమతుల్లో 40శాతం మనవే: రోజా

మత్య్స ఎగుమతుల్లో 40శాతం మనవే: రోజా

Fisheries: భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే మత్స్య ఉత్పత్తిలో 40 శాతం మత్స్య ఉత్పత్తులు మన రాష్ట్రం నుంచే జరగడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. వడమాలపేటలో మత్స్య శాఖ ఫిట్ ఆంధ్ర – ఫిష్ ఆంధ్ర రిటైల్ ఔట్ లెట్ ను ఆమె ప్రారంభించారు. మన రాష్ట్రంలో ఉత్పత్తిదారుడు,వృత్తిదారుడు, వినియోగదారుడు ముగ్గురికీ లాభం చేకూరే విధంగా ఈ ఫిష్ ఆంధ్ర కార్యక్రమం చేపట్టామన్నారు.

గత ప్రభుత్వంలో మత్స్య పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయం అంతా వ్యవసాయంతో కలిపి… తమ హయాంలో వ్యవసాయం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని, GDP విపరీతంగా పెరిగిందని  డబ్బాలు కొట్టుకున్నారని రోజా విమర్శించారు.  కానీ అత్యధిక ఆదాయం ఉన్నటువంటి చేపల పెంపకం చేపల వృత్తిదారులని తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందన్నారు.  సిఎం జగన్  ఆధ్వర్యంలో మత్స్య ఉత్పత్తుల ద్వారా రైతులు , మత్స్యకారులు ఆనందమైన జీవితం గడపాలని  ఎన్నో  చర్యలు చేపట్టారని, అవన్నీ సత్ఫలితాలు ఇస్తున్నాయని  తెలిపారు. మత్స్యకారులందరి తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు.

Also Read : విల్లు పట్టిన ఆర్కే రోజా

RELATED ARTICLES

Most Popular

న్యూస్