Sunday, January 19, 2025
HomeసినిమాFlashback Episode Devara: 'దేవర' ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతకు మించి..?

Flashback Episode Devara: ‘దేవర’ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతకు మించి..?

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న తాజా చిత్రం ‘దేవర’. భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్నఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంటే.. విలన్ గా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమాకి సంబంధించిన కథ ఏంటి అనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు. దీంతో అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది..? ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుంది..? అనేది ఆసక్తిగా మారింది.

మేటర్ ఏంటంటే.. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. అది కూడా తండ్రీకొడుకులుగా నటించనున్నారని తెలిసింది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే తండ్రి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఈ పాత్ర లీడ్ తో వచ్చే కొడుకు పాత్రను కూడా చాలా డిఫరెంట్ గా ఉండేలా డిజైన్ చేశారట. అయితే.. బాహుబలి తరహాలో తండ్రీకొడుకులు ఒకే ఫ్రేమ్ లో కనిపించరని టాక్ వినిపిస్తుంది. మరో విషయం ఏంటంటే.. కథలో చాలా స్కోప్ ఉండడంతో రెండు పార్టులుగా తీస్తే ఎలా ఉంటుందా అని కూడా కొరటాల ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

దేవర తర్వాత ఎన్టీఆర్ వార్ 2 సినిమా చేయనున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ లో స్టార్ట్ చేయనున్నారు. ఈ మూవీ 2025లో రిలీజ్ చేయాలనేది ప్లాన్. అయితే.. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా చేయాల్సివుంది. అలాగే ప్రశాంత్ నీల్ సలార్ 2 కూడా కంప్లీట్ చేయాల్సివుంది. అందుచేత దేవర 2 ఉంటుందా..? ఒకవేళ ఉంటే ఎప్పుడు ఉంటుంది అనేది క్లారిటీ లేదు. సలార్, సలార్ 2 మరింత ఆలస్యం అయితే.. దేవర 2 కూడా ఉండే ఛాన్స్ ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్