Saturday, January 18, 2025
HomeTrending Newsఫ్లెక్సీలతో తెరాస తప్పుడు ప్రచారం - కిషన్ రెడ్డి

ఫ్లెక్సీలతో తెరాస తప్పుడు ప్రచారం – కిషన్ రెడ్డి

బీజేపీ కార్యవర్గ సమావేశాలకు 18 మంది ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు హాజరు కానున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. పండుగ వాతావరణంలో సభలు నిర్వహిస్తున్నామన్నారు. బిజెపి బహిరంగసభకు రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా అవరోధాలు కల్పిస్తోందని ఈ రోజు హైదరాబాద్ లో కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని, అనేక తప్పుడు విషయాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు.

అన్ని వర్గాల ప్రజలు బీజేపీ సభ కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని, దేశంలో బీజేపీ ప్రవేశ పెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు విజయవంతం అయ్యాయని కిషన్ రెడ్డి చెప్పారు. సమావేశాల్లో భవిష్యత్ పరిపాలనపై చర్చించుకుంటున్నామని, 15 ప్రత్యేక ట్రైన్లు, వందలాది బస్సులు ఏర్పాటు చేసుకుని స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని తెలిపారు. కార్యకర్తలు, ప్రజల నుంచి విరాళాలు సేకరించి సభ లో పాల్గొంటానన్న కిషన్ రెడ్డి టిఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు, కుట్రలు చేసిన ప్రజల అండ బీజేపీకి ఉంటుందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్