Saturday, November 23, 2024
HomeTrending Newsకస్తూర్భ పాఠశాలలో పుడ్ పాయిజన్

కస్తూర్భ పాఠశాలలో పుడ్ పాయిజన్

మహబూబాబాద్ కస్తూర్భ పాఠశాలలో పుడ్ పాయిజన్ జరిగింది. 43 మంది విద్యార్థినీలకు అస్వస్థత. మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలింపు. గత రాత్రి నుంచే విద్యార్ధులను అస్వస్థత…… పట్టింఛుకోని యాజమాన్యం….. విషయం బయటకు పొక్కకుండా డాక్టర్ల ను కస్తూర్భా పాఠశాలకే పిలిచి సీక్రెట్ గా వైద్యం అందించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

సమాచారం బయటకు రావడంతో హుటాహుటిన రెండు కార్లలో మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంత మంది విద్యార్థినీలు కడుపు నొప్పి బరించలేక అవస్థలు పడుతున్నారు. మరి కొంత మంది విద్యార్ధినీలకు వెంటిలేటర్ మీద శ్వాస అందిస్తున్న పరిస్థితి ఉండగా ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన వైద్యం అందిస్తున్నారు. విద్యార్ధినీల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వని కస్తూర్భ పాఠశాల యాజమాన్యం తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. ప్రస్తుతానికి చికిత్స అందిస్తున్నారు…కొన్ని గంటలు గడిస్తే తప్పా చెప్పలేమని చెపుతున్న డాక్టర్లు.

అస్వస్థతకు గల కారణాలు కలుషిత నీరా……లేక ఆహారమనేది తెలియాల్సి ఉంది. ఈ సంఘటన పై పలు విద్యార్థి సంఘాలు భగ్గూమంటున్నాయి. చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు,మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ పరామర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్