Monday, February 24, 2025
HomeTrending Newsవట్టి వసంత్ మృతి: సిఎం జగన్ సంతాపం

వట్టి వసంత్ మృతి: సిఎం జగన్ సంతాపం

మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ ఈ ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. అయన వయసు 70 ఏళ్ళు.  కిడ్నీ మార్పిడితో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వసంత్ విశాఖలో విశ్రాంతి తీసుకున్నారు. ఆయన  స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా పూండ్ల.

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి 2004, 2009లలో శాసనసభ్యులుగా ఎన్నికైన వసంత్ 2009లో తొలిసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వైఎస్ మరణానంతరం కే. రోశయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో కూడా అయన కొనసాగారు  2014 నుంచి కాంగ్రెస్ పార్టీకి, రాజకీయాలకు దూరంగా విశాఖలో నివాసం ఉంటున్నారు. వసంత్ కుమార్ భార్య ఉమాదేవి క్యాన్సర్ తో బాధపడుతూ 2017 అక్టోబర్ 7న మరణించారు.

వట్టి వసంత్ మరణంపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్