Tuesday, February 25, 2025
HomeTrending NewsDayakar Reddy: కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత

Dayakar Reddy: కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత

కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఈ రోజు కన్నుమూశారు. బోన్‌ క్యాన్సర్ కారణంగా దయాకర్‌రెడ్డి ఆరోగ్య పరిస్ధితి విషమించడంతో.. కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తెలుగుదేశం పార్టీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దయాకర్ రెడ్డి ఒకసారి మక్తల్ నియోజకవర్గానికి, రెండు సార్లు అమరచింత నుంచి గెలిచారు. దయాకర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింత కుంట మండలం పరకాపురం గ్రామం.
దయాకర్ రెడ్డి భార్య సీతాదయాకర్ రెడ్డి  2009 లో దేవరకద్ర నుంచి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారు. దయాకర రెడ్డి మృతి ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని లోటని సిఎం కెసిఆర్ అన్నారు. దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. దయాకర్ రెడ్డి గొప్ప నేత అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దయాకర్ రెడ్డి  ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్