భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) నూతన ప్రెసిడెంట్ గా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ ఎన్నిక లాంచంమే కానుంది. ఈ పదవికి అయన ఒక్కరే నేడు నామినేషన్ దాఖలు చేశారు. రేపటితో నామినేషన్ గడువు ముగియనుంది. కాగా, కోశాధికారి పదవికి బిజెపి ఎమ్మెల్యే ఆశిష్ షెల్లార్ నామినేషన్ దాఖలు చేశారు. కార్యదర్శి, ఉపాధ్యక్ష పదవులకు ప్రస్తుతం ఆ పదవుల్లో కొనసాగుతోన్న జై షా, రాజీవ్ శుక్లాలు పోటీ పడుతున్నారు.
దాదాపు ఈ నాలుగు పోస్టులకూ ఎన్నిక ఎకగ్రీవయ్యే సూచనలే ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఐసిసి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్నారు. ఈ ఎన్నిక నవంబర్ లో జరగనుంది. అక్టోబర్ 18న జరననున్న బిసిసిఐ సర్వసభ్య సమావేశం ఐసిసి ఎన్నికకు సంబంధించి ఇండియా తరఫున పోటీ చేయబోయే అభ్యర్ధి పేరును ఖరారు చేయనుంది, గంగూలీ పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.
బిసిసిఐ ఎన్నికలకు సంబంధించి దాదాపు అన్ని పోస్టులకూ నామినేషన్లు దాఖలయ్యాయని మాజీ కార్యదర్శి నిరంజన్ షా వెల్లడించారు.