Saturday, January 18, 2025
Homeసినిమావేసవి బరిలో ప్రభాస్, మ‌హేష్‌, ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌

వేసవి బరిలో ప్రభాస్, మ‌హేష్‌, ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌

Summer Race: సినిమా ఇండ‌స్ట్రీకి సంక్రాంతి, సమ్మ‌ర్, ద‌స‌రా మూడు సీజ‌న్స్. అయితే.. 2023లో రానున్న స‌మ్మ‌ర్ కి పలువురు స్టార్ హీరోలు పోటీకి సై అంటుండ‌డం ఆస‌క్తిగా మారింది. ముందుగా చెప్పాలంటే.. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తో ‘స‌లార్’ అనే భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు స‌గం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న శృతి హాస‌న్ న‌టిస్తోంది. కేజీఎఫ్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ నుంచి వ‌స్తున్న మూవీ కావ‌డంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని 2023 స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్నారు.

ఇక స‌మ్మ‌ర్ కి రానున్న మ‌రో మూవీ మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ మూవీ. ‘అత‌డు’, ‘ఖ‌లేజా’ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి చేస్తున్న సినిమా ఇది. ఈ భారీ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హరిక అండ్ హాసిని క్రియేష‌న్స్ నిర్మిస్తుంది. ఆగ‌ష్టు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సినిమాను స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ఇక మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, గ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్లో మూవీని కూడా స‌మ్మ‌ర్ లోనే రిలీజ్ చేయ‌నున్నారు. శంక‌ర్ ఫ‌స్ట్ టైమ్ తెలుగులో చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

వీటితో పాటు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందే సినిమాను కూడా స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ లో స్టార్ట్ చేయ‌నున్నారు. ఇలా ప్ర‌భాస్, మ‌హేష్, చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ 2023 స‌మ్మ‌ర్ కి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీప‌డుతుండ‌డం ఆస‌క్తిగా మారింది. మ‌రి… ఈ బాక్సాఫీస్ వార్ లో ఎవ‌రు విన్న‌ర్ గా నిలుస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్