Monday, April 7, 2025
HomeTrending Newsరాష్ట్రంలో ఫోర్త్ వేవ్ హెచ్చరికలు

రాష్ట్రంలో ఫోర్త్ వేవ్ హెచ్చరికలు

రాష్ట్రంలో కరోనా ఫోర్త్​వేవ్​షురూ అయింది. గత పదిహేను రోజులుగా కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండటంతో దీన్ని ఫోర్త్​వేవ్‌గానే పరిగణించవచ్చని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేస్తున్నది. కానీ, గత మూడు వేవ్‌ల తరహాలో కేసులు తీవ్రత ఉండదని ఆరోగ్యశాఖ ఉపశమనం కలిగే వార్త చెప్పింది. ప్రస్తుతానికి అర్బన్​ప్రాంతాల్లో మాత్రమే బాధితులు తేలుతున్నారు. జిల్లాల్లో డైలీ ఒకటి నుంచి ఐదు కేసుల కంటే ఎక్కువ నమోదు కావడం లేదు. రాబోయే రోజుల్లో జిల్లాల్లోనూ కొంత వ్యాప్తి జరిగే ప్రమాదం ఉన్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవడంతో డెవలప్ అయిన ఇమ్యూనిటీ వలన అత్యధిక మంది జనాల్లో వైరస్‌ను తట్టుకునే శక్తి పెరిగింది. దీంతోనే రాష్ట్రంలో ర్యాపిడ్‌గా కేసులు పెరిగే అవకాశం లేదని ఎపిడమాలజిస్టులు నొక్కి చెబుతున్నారు. అయితే వేరియంట్లలో మార్పు ఉండటంతో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని వైద్యారోగ్యశాఖ ఆఫీసర్లు సూచిస్తున్నారు.

మళ్లీ ధరించాలే

కేసులు పెరుగుతుండంతో మళ్లీ మాస్కు మస్ట్ నిబంధన అమలు కానున్నది. ఇప్పటికే ఐటీ, సర్కార్ కార్యాలయాల్లో తప్పనిసరిగా పాటించాల్సిందేనని యాజమాన్యాలు ఆదేశాలు జారీ చేశాయి.

Also Read : కరోనా డేంజర్‌ బేల్స్‌ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్