France Green Signal For African Flights :
వేరియంట్ పేరుతో ఆఫ్రికా దేశాలకు రాకపోకలు నిలిపివేసిన దేశాలు ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యలతో పునరాలోచనలో పడ్డాయి. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అరికట్టే పేరుతో ప్రపంచ దేశాలు ఆఫ్రికా దేశాలకు విమానరాకపోకలు నిలిపివేస్తే అనేకమంది జీవితాలు ప్రభావితం అవుతాయని యుఎన్ మూడు రోజుల క్రితం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికే కరోనా మహమ్మారితో ప్రపంచ దేశాల్లో జీవన ప్రమాణాలు తలకిందులు అయ్యాయని, ఇప్పుడు మళ్ళీ ఆంక్షలతో పేద దేశాలు చితికి పోతాయని యుఎన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ ను ఎదుర్కోవాలని, అంక్షలతో కట్టడి అసాధ్యమని కొంత ఆలస్యం జరిగినా అన్ని దేశాలకు వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించింది.
కరోనా నిభందనలు పాటిస్తూ ఈ శనివారం(నాలుగో తేది ) నుంచి ఆఫ్రికా దేశాల నుంచి విమానాలను అనుమతిస్తామని ఫ్రాన్స్ ప్రకటించింది. దక్షిణఆఫ్రికా నుంచి వచ్చే విమానాల్లో ఫ్రెంచ్, యూరోపియన్ దేశాల పౌరులను, వివిధ దేశాల రాయబారులు, విమాన సిబ్బందిని మాత్రమె అనుమతిస్తామని ఫ్రాన్స్ వెల్లడించింది. ఈ మేరకు ఫ్రాన్స్ క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ పరీక్షలతో సంబంధం లేకుండా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారు పది రోజులు క్వారంటైన్ లో ఉండాలి. ఫ్రాన్స్ తాజా నిర్ణయంతో దక్షిణ ఆఫ్రికా, బోట్స్వాన, ఎస్వతిని,మొజాంబిక్, నమీబియా, జింబాబ్వే, లెసోతో తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఉరట లభించినట్టైంది. ఫ్రాన్స్ తరహాలోనే మరికొన్ని యూరోప్ దేశాలు ఈ వారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Also Read : అంతర్జాతీయ విమానాలపై ఓమిక్రాన్ ప్రభావం