Sunday, January 19, 2025
HomeTrending Newsమీ సేవ నిర్వాహకుడి చేతివాటం...నిర్లిప్తంగా రెవెన్యూ యంత్రాంగం

మీ సేవ నిర్వాహకుడి చేతివాటం…నిర్లిప్తంగా రెవెన్యూ యంత్రాంగం

నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా మీసేవ సెంటర్ సేవలను దుర్వినియోగం చేసి భూమి మార్పిడి చేసుకున్న జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని మీ సేవ సెంటర్ పై, నిర్వహకునిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత రైతు కళ్లెం చిన్నన్న సోమవారం జిల్లా కలెక్టర్ గుగులోతు రవి కి ప్రజావాణిలో పిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ…. బుగ్గారం మండలం సిరివంచకోట శివారులోని సర్వే నంబర్ 330లో గల తన పట్టాభూమి 31గుంటలను బుగ్గారం మీ-సేవ సెంటర్ నిర్వాహకుడు మొగిలి సుధన్ ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆయన తల్లి పేరున మార్పిడి చేసుకున్నాడని ఆరోపించారు.

రెవెన్యూ అధికారులనూ కూడా “మీ-సేవ నిర్వహకుడు” తప్పుద్రోవ పట్టించాడని అన్నారు. గతంలోనే స్థానిక మండల తహసీల్దార్ తో పాటు జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేయగా తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తానని రెవెన్యూ అధికారులకు లిఖితపూర్వకంగా వాంగ్మూలం ఇచ్చాదు. 31 గుంటల భూమికి కేవలం 15 గుంటలు మాత్రమే తిరిగి రిజిస్ట్రేషన్ చేశాడని, భూమి సర్వే చేయించి మిగతాది చేస్తానని చెప్పి మరోసారి మోసం చేశాడని కళ్లెం చిన్నన్నఅన్నారు. సర్వేయర్ ద్వారా సర్వే చేయించి నెలలు గడిచినా మిగతా 16గుంటలు రిజిస్ట్రేషన్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రావాల్సిన రైతుబంధును కూడా అక్రమ భూ మార్పిడి తో మీసేవ నిర్వాహకుడు
స్వాహా….. చేసి తన తల్లిపేరున పొందుతున్నారని పేర్కొన్నారు.

అక్రమంగా భూ మార్పిడి వ్యవహారంపై పోలీసులకూ కూడా పిర్యాదు చేసినట్లు కళ్లెం చిన్నన్న తెలిపారు. స్థానిక మండల రెవెన్యూ అధికారులు పిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, మీ- సేవ నిర్వాహకులను కాపాడే ప్రయత్నంలో అధికారులు ఉన్నారని ఆరోపించారు. స్వయంగా తానే ఆన్ లైన్ లో ఫీజు చెల్లించి మండల సర్వేయర్ ద్వారా భూమి సర్వే చేయించినా అధికారులు హద్దులు పాతలేదన్నారు. పట్టా భూమిని మీసేవ నిర్వాహకుడు మొగిలి సుధన్ తల్లి అయిన మొగిలి రాజవ్వ పేరున ఎలా మార్పిడి జరిగిందో తెలపాలని స.హ. చట్టం ద్వారా రెవెన్యూశాఖ అధికారులను కోరితే దాన్ని కూడా తుంగలో త్రొక్కి సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించారని, ఏండ్లు గడిచినా తనకు సమాచారం ఇవ్వడం లేదని బాధిత రైతు కళ్లెం చిన్నన్న ఆవేదన వ్యక్తపరిచారు.

భూమి రికార్డుల్లో గల్లంతు చేశారని మీసేవ సెంటర్ పై లిఖితపూర్వకంగా పిర్యాదు చేసినా రెవెన్యూశాఖ నుండి చర్యలు శూన్యం అయ్యాయని బాధిత రైతు కంఠతడి పెట్టారు.
రెవెన్యూశాఖ రికార్డులలో అక్రమంగా భూమిని మార్చుకోవడమే కాకుండా మొఖాపై ఉన్న భూమిని కూడా దౌర్జన్యంగా కబ్జా చేయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని  ప్రజవానిలో జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తన భూమి  తనకు 31గుంటలు రెవెన్యూశాఖ రికార్డుల్లో మార్చాలని, భూమి దక్కే విధంగా చూడాలని, తనకు చెందాల్సిన రైతుబందు డబ్బులు రూ.34,875 మొగిలి రాజవ్వ నుండి ఇప్పించాలని జిల్లా కలెక్టర్ కు బాధిత రైతు కళ్లెం చిన్నన్న మొరపెట్టుకున్నారు. మీసేవను దుర్వినియోగం చేసినందుకు.. మీసేవ నిర్వహకునిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మీసేవను సీజ్ చేయాలని కళ్లెం చిన్నన్న జిల్లా కలెక్టర్ గుగులోతు రవికి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్