Sunday, November 24, 2024
HomeTrending NewsCFO: సంపన్నులు వెళ్ళిపోతే అభివృద్ది సాధించినట్టా - మంత్రి హరీష్

CFO: సంపన్నులు వెళ్ళిపోతే అభివృద్ది సాధించినట్టా – మంత్రి హరీష్

దేశంలో అన్ని వర్గాలకు నాణ్యమైన 24 గంటల కరెంటు ఉంది అంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వ్యవసాయానికి, పరిశ్రమలకు నిరంతర కరెంట్ ముఖ్య మంత్రి పాలనాదక్షత వల్లనే సాధ్యమైందన్నారు. హైదరాబాద్ లో ఈ రోజు సిఐఐ ఆధ్వర్యంలో ఐటీసీ కాకతీయ హోటల్ లో నిర్వహించిన CFO 2023 సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. హైదరాబాదులో ఏ రకమైన కరెంటు ఉంటుందో తెలంగాణ బార్డర్లో ఉన్న చిట్ట చివరి గ్రామంలో కూడా అంతే నాణ్యమైన కరెంటును అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం అన్నారు.

మంత్రి హరీష్ రావు కామెంట్స్:

ఇప్పుడు 17000 మెగావాట్ల కరెంటు తెలంగాణ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఏడాది చివరి కల్లా 20 వేల మెగావాట్ల కరెంటు ఉత్పత్తి తెలంగాణలో జరుగుతుంది. వచ్చేయేడాది నుండి మనమే ఇతర రాష్ట్రాలకు కరెంటును అమ్మే పరిస్థితికి రాబోతున్నాం. 3 లక్షల 17వేల తలసరి ఆదాయంతో దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది. తెలంగాణలో బతుకుదెరువు కోసం బొంబాయి, దుబాయ్ బాట పట్టేవారు. ఈరోజు తెలంగాణలో వలసలు బంద్ అయినాయి. మానవ మనుగడుకు ఆధారం నీళ్లు. అలాంటి నీళ్లను మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు కట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒడిసి పట్టుకున్నం.

ఐటీ సెక్టార్లో అత్యధిక ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈరోజు దేశంలో గ్రామీణ, పట్టణ అభివృద్ధిలో 34% అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నారు అంటే తెలంగాణ దేశానికి దిక్సూచిగా ఎదిగిందని అర్థం. గత తొమ్మిది సంవత్సరాల్లో గ్రీన్ కవర్ 7.4 శాతానికి పెంచిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దేశంలో శాంతి భద్రతల లో తెలంగాణ టాప్ లో ఉంది. పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ట్రానికి రావడానికి పటిష్ట భద్రత కల్పిస్తున్నం. ప్రపంచంలో అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మన కాలేశ్వరం ప్రాజెక్టు. కేవలం మూడు సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డును సృష్టించారు.

అదే మన ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసి ప్రధాన మంత్రి అయ్యాక ప్రారంభించాడు. ఈ దేశంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి నిర్మాణాల్లో ఉంటాయి అందుకే వాటి ఫలితాలు ప్రజలకు అందవు. ఇప్పటివరకు రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయం కింద 65 వేల కోట్లను రైతుబంధు కింద ఇచ్చాం. ధరణి రిజిస్ట్రేషన్ లో ఒక విప్లవం సృష్టించింది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది వారం రోజుల్లో పాస్ బుక్ నేరుగా ఇంటికి వస్తుంది. దేశము అభివృద్ధి చెందుతోంది అంటే ఇతర దేశాల వారు మన దేశంలో పెట్టుబడులు పెడతారు. కానీ మన దేశంలోని ధనవంతులు ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారంటే మనం అభివృద్ధి చెందుతున్నామా లేక వెనుకబడి పోతున్నామా అని దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వాలు ఆలోచించాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్