Sunday, January 19, 2025
HomeTrending Newsజీవో 111పై హైకోర్టులో విచారణ

జీవో 111పై హైకోర్టులో విచారణ

జీవో 111పై హైకోర్టులో  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ వి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈ రోజు విచారణ జరిపింది. నాలుగేళ్లు దాటినా ఉన్నత స్థాయి కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది. నివేదిక జాప్యం వెనక రహస్య ఎజెండా ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. కరోనా, తదితర కారణాల వల్ల ఆలస్యమైందని  అదనపు ఏజీ రామచంద్రరావు వివరించారు. ఉన్నత స్థాయి కమిటీ సెప్టెంబర్ 13లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

గడువులోగా నివేదిక సమర్పించకపోతే ఆ రోజుతో కమిటీ రద్దవుతుదని హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈపీటీఆర్ఐ నివేదికపై కూడా అభిప్రాయాలను తెలపాలని కమిటీకి ఆదేశం. నివేదికను వెబ్ సైట్ లో పెట్టాలని కమిటీకి హైకోర్టు స్పష్టమైన ఆదేశించింది. కమిటీ నివేదికపై సెప్టెంబర్ నెలాఖరు నాటికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని స్పష్టీకరణ. జీవో 111పై విచారణ అక్టోబరు 4కి వాయిదా వేసిన హైకోర్టు ధర్మాసనం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్