Target: గత ఎన్నికల్లో 151సీట్లు గెలిచామని, ఈసారి 175 సీట్లు మనమే సాధించాలని, ఈ దిశగా పార్టీ యంత్రాగం పని చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. గత ఎన్నికలల్లో మనకు ఓటు వేయని వారికి కూడా రాజకీయాలు, పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు అందించామని, ప్రజలు సంతృప్తి పడేలా పని చేశామని కాలర్ ఎగరేసుకొని తిరగగలుగుతున్నామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 87శాతం కుటుంబాలకు మన పథకాలు చేరాయని వివరించారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ రీజినల్ కోర్డినేటర్లు పాల్గొన్నారు. ఈ సందరర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ గడప గడపకూ మన ప్రభుత్వం అనేది నిరంతరాయంగా జరిగే కార్యక్రమమని, నెలలో 20 రోజుల చొప్పున 10 సచివాలయాల్లో నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై దిశానిర్దేశం చేశారు. ఇకపై ప్రతినెలా 20రోజులపాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. దాదాపు 8నెలలపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ఒక్కో సచివాలయానికీ రెండ్రోజులపాటు కేటాయించాలని, గడప గడపకూ మన ప్రభుత్వంపై నెలకో సారి వర్క్ షాప్ నిర్వహించి ఫీడ్ బాక్ పై చర్చిస్తామన్నారు.
Also Read : ఏపీఎల్ లోగో ఆవిష్కరించిన సిఎం జగన్