Wednesday, February 5, 2025
HomeTrending Newsకేంద్రంపై యుద్ధంలో కేసీఆర్‌ తో నడుస్తా : గద్దర్‌

కేంద్రంపై యుద్ధంలో కేసీఆర్‌ తో నడుస్తా : గద్దర్‌

దళిత, గిరిజన ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్రంపై చేసే యుద్ధంలో తానూ సీఎం కేసీఆర్‌ వెంట నడుస్తానని ప్రజాగాయకుడు గద్దర్‌ పేర్కొన్నారు. పార్లమెంట్‌కు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌  పేరు పెట్టే విషయంలో బీజేపీపై ఒత్తిడి తేవడంలో తాను భాగస్వామ్యం అవుతానని ప్రకటించారు. ఆయన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిని ఆయన నివాసంలో గురువారం గద్దర్‌ కలిశారు. ఈ సందర్భంగా గద్దర్‌ మాట్లాడుతూ జాతీయ రాజకీయాలపై దాదాపు గంటకుపైగా చర్చించామని, త్వరలో టీఆర్‌ఎస్‌ ఎంపీలతో కలిసి సీఎం కేసీఆర్‌ను కలుస్తామన్నారు.
పార్లమెంట్‌ నూతన భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ పేరు పెట్టాలని, కేంద్ర ఎస్సీ, ఎస్టీ తెలంగాణ ప్రైవేట్‌ ఉద్యోగుల ఫెడరేషన్‌ ప్రతినిధులతో కలిసి ఆయన ఎంపీ రంజిత్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అభిప్రాయాలతో ఎంపీ రంజిత్‌ రెడ్డి పూర్తిగా ఏకీభవించారు. తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అంబేద్కర్‌ రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా చెప్పారని, మంత్రి కేటీఆర్‌ ఇదే అంశంపై తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసినా అంశాన్ని ఎంపీ రంజిత్‌ రెడ్డి గద్దర్‌తో ప్రస్తావించారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంట్‌ భవనానికి అంబేద్కర్‌ పేరు పెట్టడం సముచితమని రాష్ట్ర ప్రభుత్వం భావించే శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ రంజిత్‌రెడ్డి వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్