Saturday, January 18, 2025
HomeTrending NewsGaddar: సామాజిక సంస్కరణల పాట గద్దర్: జగన్ నివాళి

Gaddar: సామాజిక సంస్కరణల పాట గద్దర్: జగన్ నివాళి

ప్రజా కవి గద్దర్ మరణంపై ముఖ్యమంత్రి   వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం ఆయన పాటుపడ్డారని కొనియాడారు.

“ప్రజా కవి – గాయకుడు, బడుగు, బలహీనవర్గాల విప్లవ స్ఫూర్తి గద్దర్ గారు. గద్దర్ పాట ఎప్పుడూ సామాజిక సంస్కరణల పాటే. ఆయన నిరంతరం సామాజిక న్యాయం కోసమే బతికారు. ఆయన మరణం ఊహించనిది.   సామాజిక న్యాయ ప్రవక్తల భావాలు, మాటలు, వారి జీవితాలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తూ జీవించే ఉంటాయి. గద్దర్ గారికి మొత్తంగా తెలుగు జాతి సెల్యూట్ చేస్తోంది. ఆయన కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో మనమంతా బాసటగా ఉందాం” అంటూ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్