Monday, May 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంప్రాణానికి శ్రుతి... దేహానికి గతి నువ్వే రామా!

ప్రాణానికి శ్రుతి… దేహానికి గతి నువ్వే రామా!

మొనతేలిన రాయి ప్రవాహంలో ఒరుసుకుని…ఒరుసుకుని…నున్నని గులకరాయిగా మారినట్లు తెలుగు కూడా చివరికి అందంగా, గుండ్రంగా, తేనియలా మారింది. ఒకప్పుడు సంస్కృతం, ఇప్పుడు ఇంగ్లీషు తెలుగును మింగేశాయి. ఈ విషయంలో తమిళం చాలా నయం. కన్నడ కూడా కొంతవరకు తనను తాను రక్షించుకుంది. అందుకే తమ కన్నడ కస్తూరి అని కావేరి నీళ్లు తాగుతూ వారు గర్వంగా చెప్పుకుంటారు. మనం కృష్ణ, గోదావరి, తుంగభద్ర, మంజీరా, పెన్నా, వంశధార, నాగావళి నానా జలాలు తాగుతాం కానీ, తేట తెలుగు తాట తీసేదాకా నిద్రపోము.
ఇదొక ప్రఖ్యాత కన్నడ కీర్తన:-
పల్లవి:-
ఇన్నష్టు బేకెన్న హృదయక్కె రామా!
నిన్నష్టు నెమ్మదియు ఎల్లిహుదో రామా!
చరణం-1:
ఒళతినెడె మున్నెడెవె మనవ కొడు రామా!
సెళతక్కె సిగదంతె స్థిరతె కొడు రామా
నెన్నెగళ పాపగళ సొన్నెయాగిసు రామా!
నాళెగళు పుణ్యగళ హాదియాగలి రామా!
నన్న బాళిగె నిన్న హసివ కొడు రామా!
నన్న తోళిగె నిన్న కసువ కొడు రామా!
కణ్ణు కళెదరు నిన్న కనస కొడు రామా!
నన్న హరణక్కె నిన్న చరణ కొడు రామా!
చరణం-2 
నిన్నిష్టదంతెన్న ఇట్టిరువె రామా!
నన్నిష్టదంతెల్ల కొట్టిరువె రామా!
కష్టగళ కొడబేడ ఎనలారె రామా!
కష్ట సహిసువ సహనె కొడు ననగె రామా!
కష్ట సహిసువ సహనె ఇన్నష్టు రామా! కష్టాన్ని భరియించే సహనమింకింత రామా
కష్ట సహిసువ సహనె నిన్నష్టు రామా!
చరణం-3
కౌసల్య యాగువెను మడిలలిరు రామా!
వైదేహి యాగువెను ఒడనాడు రామా!
పాదుకెయ తలెయలిడు భరతనాగువె రామా!
సహవాస కొడు ననగె సౌమత్రి రామా!
సుగ్రీవ నాగువెను స్నేహ కొడు రామా!
హనుమనాగువె నిన్న సేవె కొడు రామా!
శబరియాగువె నిన్న భావ కొడు రామా!
చరణం-4
మడిలల్లి మరణ కొడు నా జటాయువు రామ!
ముడియల్లి అడియనిడు నా అహల్యెయు రామ!
నా విభీషణ శరణు భావ కొడు రామా!
నన్నొళిహ రావణగె సావ కొడు రామా!
కణ్ణీరు కరెయువెను నన్న తన కళె రామ!
నిన్నొళగె కరగువెను నిర్మోహ కొడు రామ!
చరణం-5
ఋత నేనె ఋతు నీనె శృతి నీనె రామా!
మతి నీనె గతి నీనె ద్యుతి నీనె రామా!
ఆరంభ అస్తిత్వ అంత్య నీనె రామా!
పూర్ణ నీనె ప్రకట నీనె ఆనంద రామా!
హర నీనే హరి నీనే బ్రహ్మ నీ రామా!
గురి నీనె గురు నీనె అరివు నీ రామా!
రఘురామ రఘు రామ రఘు రామ రామ!
నగు రామ నగ రామ జగ రామ రామా!
ఇన్నష్టు బేకెన్న హృదయక్కె రామా!
ఏ సినిమాలో ఈ పాట వాడకపోయినా విశ్వవ్యాప్తంగా బాగా ప్రచారంలోకి రావడం ఆనందించాల్సిన విషయం. గజానన శర్మ రాసి, స్వరపరిచిన గీతమిది. ఆయన వృత్తి రీత్యా ఇంజనీరు. కర్ణాటక విద్యుదుత్పత్తి సంస్థలో ఉద్యోగి. ప్రవృత్తి రీత్యా రచయిత. కన్నడలో చిన్న పిల్లల నాటకాలమీద పి హెచ్ డి చేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య మీద సమగ్రమయిన పుస్తకం వెలువరించారు. భారతీయ ఆత్మను అనుసంధానం చేస్తూ అనేక రచనలు చేశారు. శివమొగ్గ జిల్లావాసి. కన్నడ సాహిత్యానికి మేరునగధీరులను అందించిన జిల్లా శివమొగ్గ. అక్కడి నేల, గాలి తనకు తెలియకుండానే సాహిత్యాన్ని అలవాటు చేశాయంటారు గజానన శర్మ.
కొన్ని అనువాదానికి లొంగవు. అన్నీ అనువాదంలోకి ఒదిగిపోవాలని అనుకోకూడదు కూడా. అలా రాముడితో ఆర్తిగా గజానన శర్మ చెప్పుకున్న ఈ నిన్నస్టు బేకెన్నె . . . గీతం కన్నడలో వినడమే అందం. ఆసక్తి ఉన్నవారు యూ ట్యూబ్ లో వినవచ్చు.
“నా హృదయమంతా నువ్వే నిండాలి ఓ రామా!
నీ అంత నెమ్మది నాకివ్వు ఓ రామా!
నిన్నిష్టపడితే మమ్మల్ను నెత్తిన పెట్టుకుంటావు.
మేము ఇష్టపడినవన్నీ ఇస్తావు.
కష్టాలు ఇవ్వకు అని నిన్నడగం.
కష్టాలను సహించే సహనం ఇవ్వు.
ఉన్నదాంట్లో సర్దుకునే ఓర్పు ఇవ్వు.
లేనిది కోరని నేర్పు ఇవ్వు.
కష్టంలో నవ్వడం నేర్పించు.
నష్టంలో భరించడం నేర్పించు.
నన్ను సరయిన దారిలో నడిపించు.
కౌసల్యకిచ్చిన తల్లి ప్రేమ ఇవ్వు
జానకికి ఇచ్చిన అనురాగమివ్వు
లక్ష్మణుడికిచ్చిన సహవాసం ఇవ్వు
సుగ్రీవుడికిచ్చిన స్నేహమివ్వు
హనుమకిచ్చిన సేవాభాగ్యమివ్వు

శబరికిచ్చిన ఆప్యాయమివ్వు

జటాయువుకిచ్చిన మోక్షమివ్వు
అహల్యకిచ్చిన పాద స్పర్శ ఇవ్వు
విభీషణుడికిచ్చిన శరణు ఇవ్వు
నాలోపల రావణుడిని చంపు
నాలో మోహాన్ని చంపు
ఈ బతుకు రథం నువ్వే రామా!
ఈ బతుకుపండే రుతువు నువ్వే రామా!
ఈ ప్రాణానికి శ్రుతి నువ్వే రామా!
ఈ దేహానికి గతి నువ్వే రామా!
ఈ లోకానికి వేవేల వెలుగుల ద్యుతి నువ్వే రామా!
సృష్టి ఆరంభం, అస్తిత్వం, అంతం నువ్వే రామా!
అర్థం-పరమార్థం-పూర్ణం నువ్వే రామా!
శివుడు-విష్ణువు-బ్రహ్మ-త్రిమూర్తులు నువ్వే రామా!
గురి- గురువు- జ్ఞానం నువ్వే రామా!
ఓ రామ!
రఘురామ!
శ్రీరామ రామ రామ!”
నాకు కవిత్వం రాయడం వచ్చనుకున్న ఒకానొక కాలంలో నేను చేసిన స్వేచ్ఛానువాదమిది. తెలుగు- కన్నడ రెండు భాషల్లో రాయగల నా మిత్రుడు, జర్నలిస్ట్ ఎమ్మిగనూరు విజయ్ కుమార్ పంపిన అనువాదం ఈ కిందిది:-:-
పల్లవి:-
నా గుండెలో ఇంకా ఇంకా నువ్వే నిండాలి రామా!
నీయంతటి శాంతమ్ము ఏడుండేను రామా?
చరణం-1 
సుపథాన సాగేటి మనసునివ్వు రామా!
ఆకర్షణల పాలవ్వని స్థిరతనివ్వు రామా
గతకాలపు పాపాలను నశింపజెయ్యి రామా
పుణ్యార్జన చేసేటి భవిత రాని రామా
నాలోన నీయాకలి కలుగనివ్వు రామా
నా భుజములకు నీదు శక్తినివ్వు రామా
కళ్లు పోయినగానీ నీ కలలనివ్వు రామా
నన్ను నే పొందేందుకు నీ చరణమివ్వు రామా
చరణం-2 
నీకిష్టమైనదది ఏమిస్తినొ రామా
నాకిష్టమైనదెల్ల ఇచ్చావుగ రామా
కష్టాలనివ్వకని అనబోను రామా
కష్టాన్ని భరియించే సహనమివ్వు రామా
చరణం-3 
కౌసల్యనయ్యెదను ఒడిని చేరు రామా
వైదేహినయ్యెదను తోడుండు రామా
పాదుకలు తలనుంచ భరతుడయ్యేను రామా
సహవాసమివ్వుమా  సౌమిత్రిరామా
సుగ్రీవుడయ్యేను స్నేహమిమ్ము రామా
హనుమనయ్యద నీదు సేవనివ్వు రామా
శబరినయ్యేను నీ భావమివ్వు రామా
చరణం-4 
ఒడిలోన మరణమివ్వు నే జటాయువును రామా
తలపైన అడుగునిడు నేనహల్యను రామా
నే విభీషణుడను శరణు భావమివ్వు రామా
నాలోని రావణుడికి మరణమివ్వు రామా
కన్నీట పిలిచేను అహము తొలగించు రామా
నీలోనె కరిగేను నిర్మోహమివ్వు రామా
చరణం-5 
రథమీవె రుతువీవె శ్రుతివీవె రామా
మతి నీవె గతి నీవె ద్యుతి నీవె రామా
ప్రారంభం అస్తిత్వ అంత్యానివి నీవె రామా
పూర్ణమీవె ప్రకటమీవె ఆనంద రామా
హరు నీవె, హరి నీవె బ్రహ్మ నీవె రామా
గురి నీవె గురు నీవె జ్ఞానమ్ము నీవె రామా
రఘురామ రఘురామ రఘురామ రామ
నగు రామ నగ రామ జగరామ రామ
నా గుండెలో ఇంకా ఇంకా నువ్వే నిండాలి రామా!
(గజానన శర్మల కాలి గోటిని కూడా నేను చేరలేనని తరువాత తెలిసి…కవిత్వం జోలికి వెళ్లలేదు. ఆ కన్నడ కీర్తన గొప్పతనం తెలియడానికి పరిచయంగా ఈ నాలుగు మాటలు)
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
RELATED ARTICLES

Most Popular

న్యూస్