Tuesday, January 21, 2025
HomeసినిమాGame Changer: 'గేమ్ ఛేంజర్; వచ్చేది ఎప్పుడు?

Game Changer: ‘గేమ్ ఛేంజర్; వచ్చేది ఎప్పుడు?

రామ్ చరణ్‌, శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. శంకర్ ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందించారు కానీ.. తెలుగులో అవకాశాలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. స్వయంగా చిరంజీవే తనతో సినిమా చేయమని అడిగినా ఇంట్రస్ట్ చూపించలేదు. ఇప్పుడు చిరంజీవి తనయుడు చరణ్ తో శంకర్ సినిమా చేస్తుండడం విశేషం. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే.. ఈ చిత్రాన్ని స్టార్ట్ చేసినప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరిగింది కానీ.. కమల్ హాసన్ తో ఇండియన్ 2 మళ్లీ స్టార్ట్ చేసినప్పటి నుంచి గేమ్ ఛేంజర్ స్పీడుకి బ్రేకులు పడ్డాయి. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ప్రకటించలేదు కానీ.. సంక్రాంతికి వస్తుందేమో అనుకున్నారు. అయితే.. శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 తెలుగు వెర్షెన్ హక్కులను దిల్ రాజు తీసుకున్నారని తెలిసింది. ఈ మూవీని సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అందుచేత సాధ్యమైనంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అనేది శంకర్ ప్లాన్.

మహేష్‌, త్రివిక్రమ్ మూవీ సంక్రాంతికి వస్తుంది. ప్రభాస్ ప్రాజెక్ట్ కే సంక్రాంతికి వస్తుంది. ఇప్పుడు కమల్ ఇండియన్ 2 కూడా సంక్రాంతికి వచ్చేందుకు రెడీ అవుతుంది. అందుచేత ఇన్ని సినిమాల మధ్య చరణ్ గేమ్ ఛేంజర్ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని దిల్ రాజు ప్లాన్ మార్చారట. సమ్మర్ కి అల్లు అర్జున్ పుష్ప 2, ఎన్టీఆర్ దేవర చిత్రాలు రిలీజ్ కానున్నాయి. అందుచేత ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ చూసుకుని గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలని ఆలోచిస్తున్నారట దిల్ రాజు. ఈలెక్క చరణ్ గేమ్ ఛేంజర్ రావడానికి చాలా టైమ్ పట్టచ్చు అని వార్తలు వస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్