Saturday, September 21, 2024
Homeసినిమా‘గేమ్ ఆన్’తప్పకుండా ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుంది - విశ్వ‌క్ సేన్‌

‘గేమ్ ఆన్’తప్పకుండా ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుంది – విశ్వ‌క్ సేన్‌

గీతానంద్, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్ ఆన్‌’. ఏ క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్, గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌ పై ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ముఖ్య అతిథిగా హాజ‌రైన విశ్వ‌క్ సేన్‌ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో హీరో గీతానంద్‌, న‌టుడు ఆదిత్య మీన‌న్‌, ద‌ర్శ‌కుడు ద‌యానంద్‌, నిర్మాత ర‌వి క‌స్తూరి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ న‌వాబ్ గ్యాంగ్‌, అశ్విన్ – అరుణ్‌, సినిమాటోగ్రాఫ‌ర్ అర‌వింద్ విశ్వ‌నాథ‌న్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ అశ్విన్ – అరుణ్‌ మాట్లాడుతూ… ‘‘ముందుగా హీరో గీతానంద్, దర్శకుడు దయానంద్, నిర్మాత రవి గారికి థాంక్స్. ఈ సినిమాలో ఓ రొమాంటిక్ ట్రాక్‌ను కంపోజ్ చేశాం. త్వ‌ర‌లోనే పాట‌లు విడుదల‌వుతాయి’’ అన్నారు.

విశ్వ‌క్ సేన్ మాట్లాడుతూ.. ‘‘కొత్త వాళ్లను ఎంక‌రేజ్ చేయ‌టంలో తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ముందుంటారు. 2013 -14 టైమ్‌లో నేను, దయానంద్ అంద‌రం 5డీ కెమెరాలతో షార్ట్ ఫిలింస్ చేసి మా ఐడియాస్‌ను షేర్ చేసుకుంటుండేవాళ్లం. ఇప్పుడు త‌ను కూడా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడు. గీతానంద్‌, ద‌యానంద్‌ల‌కు ఈ గేమ్ ఆన్ సినిమా చాలా పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని మ‌నస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిర్మాత ర‌వి కూడా మా కాలేజ్‌లోనే చ‌దివారు. గేమ్ ఆన్ టీజ‌ర్ చాలా బావుంది. రొటీన్ సినిమా అయితే కాదు. ఖచ్చితంగా థ్రిల్ అవుతారు ’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్