Sunday, January 19, 2025
Homeసినిమా500 థియేటర్లలో ‘గంధర్వ’ విడుదల

500 థియేటర్లలో ‘గంధర్వ’ విడుదల

This Week: సందీప్ మాధవ్, గాయత్రి ఆర్. సురేష్ జంటగా నటించిన చిత్రం ‘గంధర్వ’. ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై సురేష్ కొండేటి యఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. అప్సర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుభాని నిర్మించిన ఈ చిత్రం ఈనెల 8న విడుదల కాబోతోంది. ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా థియేటర్ల కొరతతో ఇబ్బంది పడుతున్న తరుణంలో 500కి పైగా థియేటర్లను దక్కించుకోవడమే కాక భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతోంది గంధర్వ. ఈ సినిమా ప్రివ్యూల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఇక ఖచ్చితంగా ఈ సినిమా అంచనాలను మించి ఉంటుందని, తెలుగు ప్రేక్షకులు ఇంతకు ముందు ఫీలవ్వని ఒక కొత్త పాయింట్ తో ఎమోషనల్ అవుతారని మేకర్స్ భావిస్తున్నారు.

 ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీగా ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు రాప్ రాక్ షకీల్ సంగీతం అందించగా జవహర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.

Also Read :  ‘గంధర్వ’ ఫైట్ మాస్టర్లకు వెండి నాణేలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్