Saturday, January 18, 2025
HomeTrending Newsపంతం నెగ్గించుకున్న గంటా: భీమిలి నుంచి పోటీ

పంతం నెగ్గించుకున్న గంటా: భీమిలి నుంచి పోటీ

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన పంతం నెగ్గించుకున్నారు చీపురుపల్లి నుంచి పోటీ చేయాలంటూ చంద్రబాబు చేసిన విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించిన గంటా ఎట్టకేలకు భీమిలి టికెట్ సంపాదించుకున్నారు. అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్ధుల తుది జాబితాను తెలుగుదేశం పార్టీ నేడు ప్రకటించింది. మరో సీనియర్ నేత ళా వెంకట్రావుకు చీపురుపల్లి టికెట్ కేటాయించారు. కడప పార్లమెంట్ నుంచి భూపేష్ రెడ్డిని, విజయనగరం నుంచి బిసి అభ్యర్ధి కలిశెట్టి అప్పలనాయుడును ప్రకటించారు. ఇటీవలే టిడిపిలో చేరిన మాజీ మంత్రి గుమ్మనూరు జయరాంకు ముందు చెప్పినట్లు గానే గుంతకల్లు సీటు ఖరారు చేశారు. గతంలో కదిరి సీటును కోర్టు కేసుల కారణంగా కందికుంట ప్రసాద్ భార్య యశోదా దేవికి కేటాయించగా, ఆ కేసు కోర్టులో క్లియర్ కావడంతో తిరిగి ప్రసాద్  అభ్యర్ధిత్వాన్ని ప్రకటించారు.

లోక్ సభ అభ్యర్ధులు:

  1. విజయనగరం – కె. అప్పలనాయుడు
  2. ఒంగోలు – మాగుంట శ్రీనివాసుల రెడ్డి
  3. అనంతపురం – అంబికా లక్ష్మీనారాయణ
  4. కడప – సి. భూపేష్ రెడ్డి

అసెంబ్లీ అభ్యర్ధులు 

  1. చీపురుపల్లి – కళా వెంకట్రావు
  2. పాడేరు – కె. వెంకట రమేష్ నాయుడు
  3. భీమిలి – గంటా శ్రీనివాస్
  4. దర్శి – గొట్టిపాటి లక్ష్మి
  5. అనంతపురం అర్బన్ – దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్
  6. కదిరి – కందికుంట వెంకట ప్రసాద్
  7. గుంతకల్ – గుమ్మనూరు జయరాం
  8. ఆలూరు – వీరభద్ర గౌడ్
  9. రాజంపేట – సుగవాసి సుబ్రహ్మణ్యం
RELATED ARTICLES

Most Popular

న్యూస్