Sunday, January 19, 2025
Homeసినిమాసమంత నిజంగానే సినిమాలకు గ్యాప్ ఇస్తుందా..?

సమంత నిజంగానే సినిమాలకు గ్యాప్ ఇస్తుందా..?

సమంత ఇటీవల అనారోగ్యానికి గురైంది. యశోద సినిమా రిలీజ్ టైమ్ లో ఇది బయటపడింది. ఈ సినిమాకు అనారోగ్యంగా ఉంటూనే ప్రమోషన్స్ చేసింది. యశోద తర్వాత సమంత నటించిన శాకుంతలం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా టైమ్ లో కూడా అనారోగ్యంగా ఉంది. ‘శాకుంతలం’ సినిమా బాగోలేదనే విషయం ముందుగానే తెలుసుకున్న సమంత ఆతర్వాత నుంచి ప్రమోషన్స్ చేయడం ఆపేసింది. ఇప్పుడు ‘ఖుషి’ సినిమా చేస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా సమంత కథానాయికగా ఖుషి చిత్రాన్ని శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నాడు.

సెప్టెంబర్ 1న ఖుషి సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంకో మూడు రోజులు షూటింగ్ చేస్తే.. సమంత పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తవుతుంది. ఇదిలా ఉంటే.. సమంత సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వనుందని వార్తలు వస్తున్నాయి. దాదాపు ఓ సంవత్సరం పాటు సినిమాలు చేయాలి అనుకోవడం లేదనే వార్త బయటకు వచ్చింది. అంతే కాకుండా తీసుకున్న అడ్వాన్సులు కూడా వెనక్కి ఇచ్చేసిందట. ఎందుకు లాంగ్ బ్రేక్ తీసుకోవాలి అనుకుంటుంది అంటే.. మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడం కోసం సంవత్సరం పాటు హెల్త్ మీద కాన్ సన్ ట్రేషన్ చేయాలి అనుకుంటుందట.

అయితే.. తన సినిమా ముందు ఏదోలా హడావిడి చేయడం.. అందరి దృష్టి తన వైపుకు వచ్చేలా చేస్తుందనే టాక్ కూడా ఉంది. యశోద, శాకుంతలం సినిమాల ప్రమోషన్స్ టైమ్ లో హెల్త్ బాలేదని అయినప్పటికీ ప్రమోషన్స్ చేస్తున్నట్టుగా మాట్లాడిన సమంత.. ఆతర్వాత ముంబాయిలోని పబ్ లలో డ్యాన్స్ వేస్తూ కనిపించడం పై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఖుషి సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి మళ్లీ ఇలా సింపతీ కోసం ఇలా చేస్తుందా అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి.. సమంత సినిమాలకు లాంగ్ బ్రేక్ గురించి ఎలా స్పందిస్తుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్