Sunday, January 19, 2025
Homeసినిమాగీతా ఆర్ట్స్ విడుదల చేస్తోన్న లాల్ సింగ్ చద్దా?

గీతా ఆర్ట్స్ విడుదల చేస్తోన్న లాల్ సింగ్ చద్దా?

Laal Singh: అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చ‌ద్దా. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తో క‌లిసి నాగ‌చైత‌న్య న‌టించారు. చైత‌న్య‌కు ఫ‌స్ట్ బాలీవుడ్ మూవీ కావ‌డం… ఇందులో అమీర్ ఖాన్ తో క‌లిసి న‌టించ‌డంతో లాల్ సింగ్ చ‌ద్దా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇటీవ‌ల రిలీజ్ చేసిన లాల్ సింగ్ చ‌ద్దా ట్రైల‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. దీంతో ఈ సినిమాకు ఎలాంటి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది..?  ముఖ్యంగా తెలుగులో ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుంది..? అనేది ఆస‌క్తిగా మారింది.

గత కొన్ని నెలలుగా వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమాను ఎట్టకేలకు ఆగస్టు 11న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలు అయ్యాయి. ఈమద్య కాలంలో హిందీ సినిమాలు సౌత్ ఇండియన్ భాషల్లో రిలీజ్ అవ్వడం కామన్ మనం చూస్తున్నాం.
లాల్ సింగ్ చద్దా సినిమాను భారీ మొత్తానికి గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కొనుగోలు చేయడం జరిగిందని స‌మాచారం.

సినిమా పై చాలా నమ్మకంతో ఈ సినిమాను డబ్బింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. నాగ చైతన్య ఉండటం వల్ల తెలుగు ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అమీర్ ఖాన్ సినిమాలో మన నాగ చైతన్య అంటూ చాలా మంది ఆసక్తిగా లాల్ సింగ్ చద్దా కోసం వెయిట్ చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ వారు లాల్ సింగ్ చ‌ద్దాను రిలీజ్ చేస్తున్న‌ట్టుగా త్వ‌ర‌లోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Also Read : లాల్ సింగ్ చద్దా’లో చైత‌న్య‌ పాత్ర పెంపు? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్