Thursday, April 18, 2024
Homeసినిమావరుణ్ తేజ్ ‘గని’ రిలీజ్ డేట్ ఫిక్స్

వరుణ్ తేజ్ ‘గని’ రిలీజ్ డేట్ ఫిక్స్

Gani date fixed: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోగా కిర‌ణ్ కొర్రపాటి ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘గ‌ని’. ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివ‌రాత్రి సంద‌ర్భంగా గ‌ని చిత్రాన్ని ఫిబ్రవ‌రి 25న విడుద‌ల చేయ‌బోతున్నట్లు మేక‌ర్స్ ప్రక‌టించారు. నిజానికి అదే రోజున ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీ ‘భీమ్లా నాయక్’ వస్తుందని అందరూ భావించారు. అయితే.. రెండు సినిమాలకు సంబంధించిన నిర్మాతలు కలిసి కూర్చుని చర్చలు జరిపారు. తర్వాతనే గని సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌ చేశారు.

అంటే రెండు మెగా కాంపౌండ్ హీరోలకు చెందిన సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం ఎందుకని నిర్మాతలు భావించి ఉండొచ్చు. అంటే భీమ్లా నాయక్..ఫిబ్రవరి 25న విడుదల కావడం లేదు. ఏప్రిల్ 1నే రానుందనేది చెప్పకనే చెప్పేశారు మేకర్స్. గ‌ని సినిమా కోసం వ‌రుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో క‌నిపిస్తున్నారు. ప్రొఫెష‌న‌ల్ బాక్సర్‌లా క‌నిపించాల‌నే ఉద్దేశంతో అమెరికాకు వెళ్లి మ‌రీ ప్రత్యేక‌మైన శిక్షణ‌ను తీసుకున్నారు వ‌రుణ్ తేజ్. హాలీవుడ్ చిత్రం టైటాన్స్‌, బాలీవుడ్‌లో సుల్తాన్ వంటి చిత్రాల‌కు యాక్షన్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవ‌ల్‌, వ్లాడ్ రింబ‌ర్గ్ ఈ చిత్రానికి యాక్షన్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేయ‌డం విశేషం. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ సినిమా కోసం స్పెష‌ల్ సాంగ్‌లో న‌ర్తించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్