Sunday, September 8, 2024
HomeTrending Newsసిటీలో మల్టీలెవల్ ప్లాంటేషన్

సిటీలో మల్టీలెవల్ ప్లాంటేషన్

గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రధాన రహదారుల వెంట నాలుగు నుండి ఆరు  వరసల్లో మొక్కలను పెంచాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. మల్టి లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ గా వ్యవహరించే ఈ విధానం ద్వారా రహదారులకిరువైపులా అధిక విస్తీర్ణంలో ఉన్న స్థలంలో పూల మొక్కలైన తీగ జాతి మొక్కలు కాగితం పూలు, పూల పొదల మొక్కలు  మొదటి వరుసలో, ఒక ఫీట్ వరకు ఎదిగే పొగడ, భిజ్ఞోనియా మెగాఫోటమికా జాతి మొక్కలు, చివరి వరుసల్లో ఏపుగా పెరిగి నీడ నిచ్చే వేప, రావి, మర్రి తదితర చెట్లను నాటుతారు. ఈ విధానంతో ముందుగా కనువిందు చేసే పూల మొక్కలు, రెండు మూడు ఫీట్లు దట్టంగా పెరికేగె మొక్కలు, చివరగా ఏపుగా పెరిగే చెట్ల ద్వారా ఆయా మార్గాల్లో వెళ్లే ప్రయాణికులు వాహన దారులకు ఈ మల్టి లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ కనువిందు చేస్తాయి.

నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ విధమైన ప్లాంటేషన్ ను జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున చేపట్టింది. రాజేంద్ర నగర్ సర్కిల్ లోని ఆరాం గఢ్ చౌరస్తా నుండి శంషాబాద్ వరకు ఉన్న దాదాపు రెండున్నర కిలోమీటర్ల దూరంలో రోడ్డుకిరువైపులా చేపట్టిన మల్టి లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు ఉదయం పరిశీలించారు. జీహెచ్ ఎంసీ కమీషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, అర్బన్ బయోడైవర్సిటీ అడిషనల్ కమిషనర్ కృష్ణ, జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్ లతో కలిసి పరిశీలించిన సోమేశ్ కుమార్ ఈ ప్లాంటేషన్ పై సంతృప్తి వ్యక్తం చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఆరాంఘర్ వరకు పూర్తిస్థాయిలో మల్టీలేవల్ ప్లాంటేషన్ ను చేపట్టాలని జిహెచ్ఎంసి ని ఆదేశించారు.

ఎయిర్ పోర్ట్ నుండి  వచ్చే దేశ విదేశి ప్రయాణికులు ఆహ్లాదకరమైన వాతావరణంలో నగరంలో ప్రవేశించేవిధంగా గ్రీనరిని పెంపొందించాలని సూచించారు. ప్రధాన రహదారి మధ్యలో ఉన్న రోడ్ డివైడర్లలోనూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ వివరాలు, మొక్కల జాతుల వివరాలను సి.ఎస్ అడిగి తెలుసుకున్నారు. నగరంలో ఈ మల్టీలేవల్ ప్లాంటేషన్ చేపట్టేందుకు అనువుగా ఉన్న రహదారులలో  చేపడుతున్నామని కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. ఇప్పటికే మియాపూర్ బస్ డిపో, బి.కె ఎన్ క్లేవ్ రోడ్, రాందేవ్ గూడ నుండి నెక్నాం పూర్ రోడ్, మల్కాజ్ గిరి సర్కిల్ లోని జడ్ టి.సి నుండి ఎన్.ఎఫ్.సి వరకు ఈ ప్లాంటేషన్ ను చేపట్టామని వివరించారు. అనంతరం హరితహారంలో భాగంగా సి.ఎస్ సోమేశ్ కుమార్ మొక్కలు నాటారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్