Sunday, January 19, 2025
Homeసినిమా'ఘోస్ట్' న్యూ ఇయర్ మోషన్ పోస్టర్ రిలీజ్

‘ఘోస్ట్’ న్యూ ఇయర్ మోషన్ పోస్టర్ రిలీజ్

ప్రస్తుత బిగ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ ఏజ్ లో ప్రేక్షకులు ఉత్కంఠ రేపే రోమాంచితమైన సినిమాలనే థియేటర్ లో చూడడానికి ఇష్టపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి చిత్రంతోనే వస్తున్నారు కరుణడ చక్రవర్తి డా శివరాజ్ కుమార్. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్యాన్ ఇండియా లెవెల్ లో ‘ఘోస్ట్’ రూపొందుతోంది. కన్నడ బీర్బల్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు రూపొందించి తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రానికి దర్శకుడు. ప్రముఖ రాజకీయ నాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా టీం అద్భుతంగా డిజైన్ చేసిన రెట్రో మోషన్ పోస్టర్ తో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ఘోస్ట్ మోషన్ పోస్టర్ ను ఎంతో కేర్ తీసుకుని డిజైన్ చేశారు. చిత్రానికి సంబందించిన కీలక అంశాలు అన్నీ కలగలిపి థీమ్ కి తగ్గట్లు ఆసక్తి రేపేలా పోస్టర్ ఉంది. కార్ స్పీడో మీటర్ తో మొదలై, ఎగిరే బుల్లెట్లు, గన్ ఫైర్ అవగానే కార్ దూసుకు రావడం, ఎరిగే బుల్లెట్లు, మెషీన్ గన్… వీటికి తోడు అర్జున్ జన్య అందించిన పవర్ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చివరగా శివన్న వింటేజ్ లుక్ మోషన్ పోస్టర్ ను మరో స్థాయికి తీసుకెళ్ళాయి. ఈ లుక్ ఘోస్ట్ చిత్రంలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో రానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్