అహ్మాదాబాద్ టెస్టులో ఇండియా నెమ్మదిగా ఆడుతోంది. వికెట్ నష్టపోకుండా 36 పరుగులతో నేడు మూడోరోజు మొదలు పెట్టిన ఇండియా ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 289 పరుగులు చేసింది.
జట్టు స్కోరు 74 వద్ద రోహిత్ శర్మ (35) ఔట్ కాగా, శుభ్ మన్ గిల్- పుజారా రెండో వికెట్ కు 113 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. పుజారా 42 రన్స్ చేసి వెనుదిరగగా, గిల్ తన టెస్ట్ కెరీర్ లో రెండో సెంచరీ నమోదు చేశారు. 128 పరుగులు సాధించిన గిల్ మూడో వికెట్ గా 245 పరుగుల వద్ద ఔటయ్యాడు.
విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ పూర్తి చేసి 59; రవీంద్ర జడేజా 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఇండియా ఇంకా 191 పరుగులు వెనకబడి ఉంది.
నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ, కున్నేమాన్ తలా ఒక వికెట్ సాధించారు.