Saturday, January 18, 2025
Homeసినిమాపుష్ప 2 కోసం పాన్ వరల్డ్ ప్లాన్

పుష్ప 2 కోసం పాన్ వరల్డ్ ప్లాన్

Glimpse: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2‘. ఈ సినిమా కోసం సుకుమార్ కథ పై చాలా రోజులు కసరత్తు చేశారు. ఫైనల్ గా కథ పై కుస్తీ కంప్లీట్ అవ్వడంతో పూజా కార్యక్రమాలతో పుష్ప 2 స్టార్ట్ చేశారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘పుష్ప’ సంచలన విజయం సాధించడంతో పుష్ప 2 పై భారీ అంచనలు ఉన్నాయి. అయితే.. ఎవరెన్ని అంచనాలతో వచ్చిన అదిరింది అనేలా  ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే.. పై మరింత క్రేజ్ తీసుకువచ్చేందుకు సుకుమార్ పాన్ వరల్డ్ ప్లాన్ రెడీ చేశారట. ఏంటి ఈ పాన్ వరల్డ్ ప్లాన్ అంటే… పుష్ప 2 ఫస్ట్ గ్లింప్స్ కోసం రామోజి ఫిల్మ్ సిటీలో ప్రత్యేకమైన సెట్ లో ఈ షూటింగ్ చేస్తున్నారట. ఇక్కడ మరో విశేషం ఏంటంటే డిసెంబర్ 16న రిలీజ్ అవుతున్న ‘అవతార్ 2’ తో పాటుగా పుష్ప 2 స్పెషల్ టీజర్ రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. జేమ్స్ కెమెరాన్ తెరకెక్కించిన మరో అద్భుత సృష్టి అవతార్ 2. ఆ సినిమా కోసం ప్రపంచ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆ సినిమాతో పాటు స్పెషల్ టీజర్ రిలీజ్ చేస్తే… కావాల్సినంత పబ్లిసిటీ వస్తుందని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. ఇదో రకంగా సూపర్ ఐడియా అని చెప్పొచ్చు. అలా చేస్తే.. అవతార్ 2 ఆడే ప్రతి చోట పుష్ప 2 గ్లింప్స్ రిలీజ్ అవుతుంది. పుష్ప 2 స్పెషల్ టీజర్ ని మొత్తం 25 భాషల్లో రెడీ చేస్తున్నారట. అవతార్ 2 తో పుష్ప 2 టీజర్ అంటే నిజంగానే సినిమాకి నెక్స్ట్ లెవల్ ప్రమోషన్ అని చెప్పొచ్చు. సుక్కు ప్లాన్ చూస్తుంటే.. పుష్ప 2 మూవీతో చరిత్ర సృష్టించడం ఖాయం అనిపిస్తుంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్