పాశ్చాత్య సంస్కృతి ప్రతిబింబించే గోవాలో…ఓటర్లు సంప్రదాయ బిజెపిని ఆదరించారు. గోవా ఎన్నికల ఫలితాల్లో బిజెపి ముందంజలో ఉంది. గోవాలోని మొత్తం 40 సీట్లలో బిజెపి ఆధిక్యంలో ఉంది. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సంక్యులిం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పరికార్ పణజి స్థానంలో ఏడు వందల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉత్పల్ పై బిజెపి అభ్యర్థి బాబుష్ విజయం సంధించారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే చంద్రకాంత్ శేట్యే బిజెపికి మద్దతు ఇస్తున్నారని ప్రమోద్ సావంత్ తెలిపారు.
ఆప్ రెండు సీట్లు సాధించగా మొదటిసారిగా తృణముల్ కాంగ్రెస్ గోవాలో ఖాతా తెరిచింది. హంగ్ ఏర్పడనుందనే సర్వేల నేపధ్యంలో ఆప్ పార్టీ కీలకంగా మారనుంది. అప్పుడే క్యాంపు రాజకీయాలు ప్రారంభమవుతున్నాయి. ఎక్కడైనా ఫలితాల అనంతరం క్యాంపు రాజకీయాలు మొదలవుతాయి. కానీ గోవాలో ఫలితాల రాకుండానే ఎగ్జిట్ పోల్స్ పలితాల్ని బట్టి రాజకీయ పార్టీలు అప్రమత్తమవుతున్నాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్..గోవాలో హంగ్ ఏర్పడనుందనే సంకేతాలిచ్చాయి. దాంతో గోవాలో క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. గత అనుభవం దృష్టా కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమవుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 13 మందినే గెల్చుకున్నా..చిన్నాచితకా పార్టీలు, సభ్యుల మద్దతుతో అధికారం చేపట్టింది. ఈసారి ఆ అవకాశం ఇవ్వకూడదనేది కాంగ్రెస్ ఆలోచన. కాంగ్రెస్ నేతలు చిదంబరం, డీకే శివకుమార్, దినేష్ గుండూరావులు గోవాలో మకాం వేశారు. అటు బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఫడ్నవిస్‌లు గోవా చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అప్పుడే తన అభ్యర్ధుల్ని రిసార్ట్స్‌కు మార్చింది.
గోవాలో మొత్తం సీట్లు – 40
బిజెపి – 20
కాంగ్రెస్ – 11
ఆప్ – 02
ఎం.జి.పి. – ౦2
ఇతరులు – 05
ఇవి కూడా చదవండి: పంజాబ్ లో కాంగ్రెస్ ను ఉడ్చేసిన ఆప్