Sunday, January 19, 2025
HomeTrending Newsఉప్పల్ కారిడార్ లో గోల్ మాల్.. కేంద్రమంత్రికి ఫిర్యాదు

ఉప్పల్ కారిడార్ లో గోల్ మాల్.. కేంద్రమంత్రికి ఫిర్యాదు

కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఉప్పల్ బిజెపి మాజీ శాసనసభ్యుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ డిల్లీలోని మంత్రి ఇంటి వద్ద కలిశారు ఈ సందర్భంగా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను వేగవంతం చేసే విధంగా అధికారులను ఆదేశించాలని కోరారు భూసేకరణ సంబంధించిన విషయములో భవన యజమానులకు నష్ట పరిహారం ఇచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని కొంతమందికి ఒక తరహా పరిహారము, మరికొంతమందికి ఇంకొక తరహ పరిహారము ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని గడ్కరి దృష్టికి తీసుకెళ్లారు.

భూమి ఇచ్చిన వారిని తిరిగి భవనాలను నిర్మించుకుంటే జిహెచ్ఎంసి అధికారులు అనేక రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలని వివక్ష చూపిస్తూ నిర్లక్ష్యం చేయడాన్ని కేంద్ర మంత్రికి ప్రభాకర్ తెలియజేశారు. కేంద్ర మంత్రి స్పందిస్తూ తప్పకుండా ఈ అంశాలనే సంబంధిత అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తెలియజేసి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని హామీ ఇచ్చారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్