Sunday, January 19, 2025
Homeసినిమాగాడ్ ఫాద‌ర్ హిట్ లిస్టులోకి వెళుతుందా?

గాడ్ ఫాద‌ర్ హిట్ లిస్టులోకి వెళుతుందా?

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్‘… మోహన్ రాజా దర్శకత్వం వ‌హించిన ఈ మూవీకి ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే హిట్ టాక్ వ‌చ్చింది. దీంతో మెగా అభిమానులు ముఖ్యంగా చిరంజీవి చాలా హ్యపీగా ఫీల‌య్యారు. ఇక రెవెన్యూ విషయానికొస్తే… చిరంజీవి సినిమా కావడంతో గాడ్ ఫాదర్ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరిగాయి. పైగా దసరా సీజన్ కూడా కావడంతో వసూళ్లు చెప్పుకోదగ్గ స్థాయిలో వచ్చాయి. గాడ్ ఫాదర్ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 38 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు స్వయంగా యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. నిజానికి చిరంజీవి గత సినిమాలతో పోల్చి చూస్తే, ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ తక్కువే.

‘ఆచార్య’ సినిమాకు మొదటి రోజు ఏకంగా 53 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అయితే.. నెగెటివ్ టాక్ కారణంగా, మూడో రోజుకే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద క్రాష్ అయింది. గాడ్ ఫాదర్ విషయంలో ఆ ప్రమాదం లేదు. అంతేకాదు, ఈ సినిమాని తక్కువ థియేటర్లలో విడుదల చేశారు. ఎక్కువ రోజులు రన్ ఉండాలి అని ప్లాన్ వేశారు. ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది కాబట్టి, ఓపెనింగ్స్ తక్కువగా ఉన్నప్పటికీ సినిమా పుంజుకోవడం గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. మ‌రి.. గాడ్ ఫాదర్ బ్రేక్ ఈవెన్ అవుతుందా.?  హిట్ లిస్టులో ప‌డుతుందా..?   లేదా..?  అనేది ఆస‌క్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్