Saturday, January 18, 2025
Homeసినిమాఅభిమానులను అలరించిన 'గాడ్ ఫాద‌ర్' ట్రైలర్

అభిమానులను అలరించిన ‘గాడ్ ఫాద‌ర్’ ట్రైలర్

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన భారీ, క్రేజీ మూవీ గాడ్ ఫాద‌ర్. ఈ చిత్రానికి మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌ళ‌యాళంలో విజ‌యం సాధించిన లూసీఫ‌ర్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాని తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా మార్పులు చేర్పులు చేశారు. ఈ మూవీ టీజ‌ర్ అండ్ సాంగ్స్ కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ దూకుడుగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అనంతపురంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు.

ఈ సందర్భంగా గాడ్ ఫాదర్ థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. “మన స్టేట్ సీఎం పీకేఆర్ ఆకస్మిక మరణం.. మంచోళ్ళందరూ మంచోళ్ళు కాదు.. చాలా డ్రామాలు జరుగుతున్నాయి వెనుక.. అన్నీ రంగులు మారతాయి” అని పూరి జగన్నాధ్ వాయిస్ ఓవర్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉండగా మరణిస్తే.. రాష్ట్రంలోని రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ ట్రైలర్ చూపించారు.

ఇందులో మోస్ట్ డేంజర్ అండ్ మిస్టీరియస్ మ్యాన్ గా పవర్ ఫుల్ రోల్ లో చిరంజీవిని పరిచయం చేశారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో మెగాస్టార్ స్టైలిష్ గా చాలా కొత్తగా కనిపించాడు. “నేను రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను.. నా నుంచి రాజకీయం దూరం కాలేదు నేను ఉన్నంత వరకూ ఈ కుర్చీకి చెద పట్టనివ్వను” అంటూ చిరు తనదైన శైలిలో పలికిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. కండలవీరుడు ఎప్పటిలాగే తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకర్షించాడు.

ట్రైలర్ చివర్లో చిరు ఇంట్రెన్స్ గా నడుచుకుంటూ వస్తుండగా.. సల్మాన్ అడ్డొచ్చిన రౌడీలను ఊచకోత కొస్తూ కనిపించాడు. అలానే ఇద్దరూ మెషిన్ గన్స్ తీసుకొని ఫైరింగ్ చేయడాన్ని మనం చూడొచ్చు.  హై వోల్టేజ్ యాక్షన్ తో కూడిన పొలిటికల్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దినట్లు అర్థమవుతోంది. ఈ ట్రైల‌ర్ గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే.. మెగా ఫ్యాన్స్ కి విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది.

Also Read : గాడ్ ఫాదర్ మదగజమా! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్