Sunday, February 23, 2025
HomeTrending Newsశ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా దుర్గమ్మ

శ్రీ లలితా త్రిపురసుందరి దేవిగా దుర్గమ్మ

దేవీ నవరాత్రులలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ కనకదుర్గమ్మ నేడు (అక్టోబర్ 10, ఆదివారం) నాలుగో రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకాలను పాలించే సుందరి అని అర్థం. తొలిరోజున స్వర్ణకవచాలంకృత అలంకారంలో, రెండవ రోజున బాలా త్రిపుర సుందరిగా, మూడోరోజున శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు ఆశీస్సులు అందించారు.

రేపు 11-10-2021 తేదీ, సోమవారం రోజున శుద్ధ పంచమి, షష్ఠి తిధులు వచ్చినందున శ్రీ అమ్మవారు మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం లోనూ, అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీ మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.

12-10-2021శుద్ధ సప్తమి మంగళవారం రోజున శ్రీ సరస్వతీ దేవి(మూలా నక్షత్రం)

13-10-2021శుద్ధ అష్టమి బుధవారం రోజున శ్రీ దుర్గాదేవి(దుర్గాష్టమి)

14-10-2021శుద్ధ నవమి గురువారం రోజున శ్రీ మహిషాసురమర్దని(మహార్ణవమి)

15-10-2021శుద్ధ దశమి శుక్రవారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి(విజయదశమి)

12వ తేదీ మూలా నక్షత్రం రోజున సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుంది

RELATED ARTICLES

Most Popular

న్యూస్