Saturday, January 18, 2025
Homeసినిమాజూన్ 17న స‌త్య‌దేవ్ ‘గాడ్సే' రిలీజ్

జూన్ 17న స‌త్య‌దేవ్ ‘గాడ్సే’ రిలీజ్

“సమాజంలో భాగమైన రాజకీయ వ్యవస్థ అవినీతమయమైనప్పుడు అరాచకం పెరుగుతుంది. అలాంటి అవినీతి రాజకీయానికి కేరాఫ్ అయిన కొంత మంది నాయకుల‌ను ఓ యువ‌కుడు ప్ర‌శ్నిస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే జూన్ 17న రిలీజ్ అవుతున్న ‘గాడ్సే’ సినిమాను చూడాల్సిందేనంటున్నారు సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్. మరి ఇంత‌కీ రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌శ్నించే యువ‌కుడే గాడ్సే.

వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌’ వంటి సూప‌ర్ హిట్ మూవీ రూపొందిన సంగ‌తి తెలిసిందే. మ‌రోసారి ఈ హిట్ కాంబో క‌లిసి చేస్తోన్న గాడ్సే చిత్రంపై టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక టీజ‌ర్‌తో ఈ అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.

ఇప్పుడు ఈ సినిమాను జూన్ 17న గ్రాండ్ లెవ‌ల్లో సి.కె.స్క్రీన్స్ బ్యాన‌ర్ పై విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు నిర్మాత సి.క‌ళ్యాణ్ తెలిపారు. గాడ్సే సినిమాను డైరెక్ట్ చేయ‌టంతో పాటు ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌ల‌ను కూడా గోపి గ‌ణేష్ అందించారు.  ఐశ్వ‌ర్య ల‌క్ష్మి ఇందులో ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుంది. బ్ర‌హ్మాజీ ,సిజ్జూ మీన‌న్ తదిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Also Read : మెగాస్టార్ చేతుల మీదుగా ‘గాడ్సే’ టీజ‌ర్‌

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్