Friday, March 29, 2024
Homeజాతీయంఓబీసీ స్కాలర్‌షిప్‌ల కోసం రూ. 3459 కోట్లు

ఓబీసీ స్కాలర్‌షిప్‌ల కోసం రూ. 3459 కోట్లు

గడచిన మూడేళ్ళలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) విద్యార్ధులకు పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కింద కేంద్ర ప్రభుత్వం 3,459 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సుష్రీ ప్రతిమా భౌమిక్‌ తెలిపారు. ఓబీసీ విద్యార్ధులకు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం చేసే ఖర్చు 20 శాతం కంటే తక్కువ వున్న విషయమై రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ అలాంటిదేమీ లేదని చెప్పారు.

2017-18 నుంచి 2019-20 వరకు సుమారు కోటీ 23 లక్షల మంది ఓబీసీ విద్యార్ధులకు ప్రభుత్వం పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఓబీసీ విద్యార్ధులకు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల పంపిణీని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేస్తాయని తెలిపారు. అర్హులైన ఓబీసీ విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఆర్థిక సహాయానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత నిధులను వెచ్చించి స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేస్తుందని వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్