Sunday, January 19, 2025
Homeసినిమాగోపీచంద్ ‘...బుల్లెట్‌’ కు అక్టోబర్ లో మోక్షం!

గోపీచంద్ ‘…బుల్లెట్‌’ కు అక్టోబర్ లో మోక్షం!

గోపీచంద్, న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టెనర్ ‘ఆరడుగుల బుల్లెట్‌’. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీని అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వ‌క్కంతం వంశీ క‌థ‌, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ అందించారు. అతి త్వరలో ఈ మూవీ ప్రమోషన్స్ ను మొదలు పెట్టనున్నారు.

ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాలి కానీ.. కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వచ్చింది. ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హా తదితరులు ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు ఫొటోగ్రాఫర్‌: బాలమురగన్‌, డైలాగ్స్‌: అబ్బూరి రవి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, పిఆర్ఒ: వంశీ-శేఖ‌ర్‌.

RELATED ARTICLES

Most Popular

న్యూస్