Thursday, March 28, 2024
HomeTrending Newsఆవేదనతోనే అలా స్పందించా : కాకాణి

ఆవేదనతోనే అలా స్పందించా : కాకాణి

నెల్లూరులోని గొలగమూడి వెంకయ్య స్వామి గుడి సన్నిధిలో ఆనందయ్య మందు పంపిణీని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, రోజుకి 2 వేల నుంచి 3 వేలమందికి ఆనందయ్య మందు పంపిణీ చేస్తామని తెలిపారు. ఆనందయ్య విశేషమైన సేవలు అందిస్తున్నారన్నారు. అల్లోపతి మందులు వాడుతూనే ఆనందయ్య మందు తీసుకోవాలని కాకాణి సూచించారు.

మందు పంపిణీ సందర్భంగా కాకాణి తనపై వచ్చిన విమర్శలు తలచుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మందు తో డబ్బులు సంపాదించాలనే ఆలోచన తనకు ఎంతమాత్రం లేదని, ఒకవేళ అలా తాను భావించి ఉంటే, వెంకటేశ్వర స్వామి సాక్షిగా నేను నా కుటుంబం సర్వ నాశనం అయిపోతామని ఆవేదనతో చెప్పారు.

తనపై వచ్చిన విమర్శల పట్ల ఆవేశానికి లోనయ్యి తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందని, వాడకూడని భాష వాడాల్సి వచ్చిందని కాకాణి గోవర్ధన్ రెడ్డి వివరించారు. పదిమందికి మంచి చేసే పని చేయాలని తలచినపుడు కూడా… ఇలాంటి వాటిలో కూడా రాజకీయాలు జొప్పించి మనిషిని బలహీన పరిచేలా మనుషులు దిగాజారుతున్నారా అని విస్మయం కలిగిందన్నారు. ప్రజా జీవితంలోకి వచ్చి సేవ చేద్దమనుకుంటే ఇలా ఆరోపణలు రావడం విచారకరమన్నారు. ఆనందయ్యతో తనకు 2014 నుంచి అనుబంధం ఉందని, ఆయనకు అండగా నిలిచాను తప్ప ఆయన్ను బెదిరించానని కొందరు విమర్శించడం బాధాకరమన్నారు.

‘‘ఆనందయ్య మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవు. సోమవారం నుంచి మందు పంపిణీ చేస్తామని చెప్పి.. ఆనందయ్య ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కోవిడ్‌ వచ్చిన వారు ఎరుపు రంగు ప్యాకెట్‌ మందు వాడాలి. కోవిడ్‌ నివారణ కోసం నీలం రంగు ప్యాకెట్‌ మందు వాడాలి. ప్రజలకు మేలుచేసే ఉద్దేశంతోనే ఆనందయ్యకు మద్దతు ఇచ్చాం. కేవలం సర్వేపల్లితోనే ఆనందయ్య మందు ఆగిపోదు. త్వరలోనే ఇతర జిల్లాలకూ ఆనందయ్య మందు పంపిణీ చేస్తాం. ఆనందయ్య కుటుంబానికి భవిష్యత్‌లోనూ అండగా నిలుస్తాం. ప్రతిఒక్క ఇంటికీ ఆనందయ్య మందు పంపిణీ జరుగుతుంది’’ అని గోవర్థన్‌రెడ్డి అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్