Saturday, July 27, 2024
HomeTrending Newsకంటి మందుకూ హైకోర్టు ఓకే

కంటి మందుకూ హైకోర్టు ఓకే

ఆనందయ్య కంటి మందు పంపిణీకి కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటిచుక్కల మందుపై 2 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.

కేంద్ర అయుష్ శాఖ, సిసిఆర్ఏఎస్ లు ఇచ్చిన నివేదికలు పరిశీలించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆనందయ్య తయారు చేస్తున్న పి,ఎల్, ఎఫ్ మందులకు అనుమతి మంజూరు చేసింది కానీ కంట్లో వేసే మందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. దీనిపై ఇంకా సమగ్ర నివేదికలు రావాల్సి ఉందని పేర్కొంది. కంటి మందు కోసం చేసిన స్టెరిలిటీ పరీక్షలో ఇబ్బంది ఉందని ప్రభుత్వం తెలిపింది. దీనిపై సమగ్ర నివేదిక వచ్చిన తర్వాతే అనుమతిస్తామని పేర్కొంది, దీనికి మూడు నెలల సమయం పడుతుందని ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది.

ప్రభుత్వ వాదనను పరిశీలించిన హైకోర్టు ప్రాణాపాయ స్థితిలో ఉండి మందు తీసుకావాలనుకునే వారికి మాత్రం అడ్డంకులు సృష్టించవద్దని సూచించింది. మందు వేసుకునేందుకు వారికి అనుమతి ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21 కి వాయిదా వేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్