Tuesday, June 9, 2026
Homeస్పోర్ట్స్సెప్టెంబర్ 19 నుంచి ఐపిఎల్

సెప్టెంబర్ 19 నుంచి ఐపిఎల్

ఐపిఎల్-2021 సీజన్ సెప్టెంబర్ 19న తిరిగి మొదలుకానుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో  ఈ మ్యాచ్ లు జరుగుతాయి. దుబాయ్, షార్జా, అబుదాబి స్టేడియాల్లో ఈ మ్యాచ్ లు జరుగుతాయి.  అక్టోబర్ 15న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

కోవిడ్ రెండో దశ ఉధృతి తో పాటు ఐపిఎల్ ఆడుతున్న జట్లలోని ఇద్దరు ముగ్గురు ఆటగాళ్ళతో పాటు కొంతమంది సహాయ సిబ్బందికి కూడా కరోనా సోకింది. ఈ కారణంగా  ఐపిఎల్-2021 సీజన్ ను మే 4న నిరవధికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. మొత్తం 60మ్యాచ్ లు జరగాల్సి ఉండగా వాయిదా పడే నాటికి 29 మాత్రమే పూర్తయ్యాయి. మరో 31మ్యాచ్ లు జరగాల్సి ఉంది.

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తోపాటు ఇంగ్లాండ్ తో ఐదు టెస్టులు ఆడేందుకు భారత జట్టు ఇంగ్లాండ్ చేరుకుంది.  ఈ సీరీస్ సెప్టెంబర్ 14 నాటికి పూర్తవుతుంది.  ఇంగ్లాండ్ నుంచి నేరుగా ఆటగాళ్ళు ఎమిరేట్స్ చేరుకునేలా ఏర్పాట్లు చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular