Saturday, November 23, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్ఉపాధ్యాయులపై వేధింపులు: అశోక్ బాబు

ఉపాధ్యాయులపై వేధింపులు: అశోక్ బాబు

రాష్ట్రంలో ఉపాధ్యాయులను ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పి. అశోక్ బాబు ఆరోపించారు. కేవలం రెండు నిమిషాలు లేట్ గా వచ్చినందుకు శ్రీకాకుళం జిల్లాలో ఒకరు, అనకాపల్లి జిల్లాలో ఇద్దరు హెడ్ మాస్టర్లను సస్పెండ్ చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా మరో 620 మందికి మెమోలు ఇచ్చినట్లు వచ్చిన వార్తలను అయన ప్రస్తావించారు. మరికొన్ని చోట్ల బాత్ రూమ్ ఫోటోలు పెట్టలేదన్న నెపంతో కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. పీఆర్సీ కోసం ఉపాధ్యాయులు విజయవాడలో పెద్దఎత్తున ధర్నా చేయడం  సిఎం జగన్ కు కంటగింపుగా మారిందని, దీన్ని సహించలేకపోతున్నారని  విమర్శించారు.  దీని వల్లే టీచర్లను వేధిస్తున్నారన్నారు.

జాతీయ విద్యా విధ్యానాన్ని ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తప్ప మరే రాష్ట్రమూ అమలు చేయడం లేదని, అంగన్ వాడీ నుంచి రెండో తరగతి వరకూ పీపీ-1 గా మార్చి, మూడు నుంచి పదో తరగతి వరకూ శూల్లను విలీనం చేసి, తద్వారా వేలాది స్కూళ్ళు మూసి వేయడం, పెద్ద సంఖ్యలో టీచర్ పోస్టులు అదనంగా ఉంటాయని వివరించారు. మూడేళ్ళుగా డీఎస్సీ ఇవ్వలేదన్నారు.

టీచర్లు పనిచేయడంలేదన్న భావన సిఎం కు ఉంటే అది మానుకోవాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా వారిపై పని ఒత్తిడి పెంచడం సరికాదన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్