Sunday, January 19, 2025
HomeTrending Newsతడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఆదేశం

తడిసిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఆదేశం

Tainted Grain : అకాల వర్షాలతో చాలా చోట్ల వరిధాన్యం తడిసిపోయిందని, తడిసిన ధాన్యం ఆరబెట్టి మిల్లర్లతో కొనుగోలు చేసేలా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించడం జరిగిందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సిద్దిపేట జిల్లాలో ఈ రోజు తడిసిన ధాన్యాన్ని స్వయంగా అన్ని మార్కెట్లకు వెళ్లి చూసిన మంత్రి హరీష్ రావు 600 ప్యాడీ క్లీనర్లు ఏర్పాటు చేశామన్నారు.  రైతులు ప్రభుత్వంతో సహకరించి కళ్లంలోనే ఆరబెట్టి ధాన్యం తెస్తే, ఆదే రోజు కొనడానికి అవకాశం ఉంటుందన్నారు. అలా ఆరబెట్టకుండా మార్కెట్ యార్డుకు, ఐకేపీ సెంటర్లకు తెస్తే వర్షానికి తడిసిపోతున్నాయి. లోతట్టు ప్రాంతంలో ఆరబొస్తే అకాల వర్షం వల్ల ధాన్యం తడుస్తోందన్నారు.

దేశంలో ఎక్కడైనా పండిన పంట కొనే వ్యవస్థ ఉంది. కాని తెలంగాణ వడ్లు కొనమని మొట్టమొదటి సారి బీజేపీ ప్రభుత్వం మొండికేసి తొండాట ఆడుతుందని మంత్రి ఆరోపించారు. రా రైస్ కొంటం, బాయిల్డ్ రైస్ కొనం అన్నరు. వేసవిలో తెలంగాణలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తుంది. అయినా తెలంగాణ ప్రభుత్వం 3 వేల కోట్ల భారం భారిస్తోందన్నారు. కాని కక్ష్య కట్టిన కేంద్ర ప్రభుత్వం రైతుల నుండి వడ్లు కొనుగోలు చేసే సమయంలో 2900 రైస్ మిల్లుల మీద దాడులు చేయిస్తోంది. ఒక నెల ఆగి దాడులు చేస్తే ఏమవుద్దని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. రైతులు నష్టపోవాలి. వ డ్లు కొనవద్దు అన్న కారణంతో ఎఫ్. సీఐ. అధికారులతో దాడులు చేయిస్తోంది.

మిల్లు యాజామాన్యాలను తమ ఆధీనంలో ఉంచుకుని సీజ్ చేస్తున్నరు. లారీలలో వడ్లు మిల్లుకు వెళ్తే దించే పరిస్థితి లేదని మంత్రి పేర్కొన్నారు. మేం తనిఖీలు చేయవద్దని అనడం లేదు. ఒక్క నెల అయితే మా ధాన్యం కొనుగోలు పూర్తవుద్దన్నారు. మీ ఉద్దేశం ఏంటి..వడ్లు కొనుగోలు చేయకపోతే తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డపేరు రావాలి. రైతుల వడ్లు కొనవద్దని చూస్తున్నరు. కుట్రతో కేంద్రం వ్యవహరిస్తోంది. దీన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నమన్నారు. రైతు సోదరులు దీన్ని గమనించాలి. 2990 మీద రైడ్ చేస్తరా… ఇప్పుడు చేయడం వల్ల రైతులకు ఇబ్బంది అవుతుందన్నారు.

తెలంగాణ రైతాంగం బీజేపీ కుట్రలు గమనించాలని మంత్రి హరీష్ రావు కోరారు. నల్ల చట్టాలు తేలేదు కాని, నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చారు. బాయిలకాడ మీటర్లు పెట్టాలంటున్నారు. డిజీల్ ధరలు పెంచారు. ట్రాక్టర్ తో దున్నడానికి ఎకరానికి ఐదు వేలు ఖర్చు అవుతుంది. వరి కోత మిషన్ తో పని ఇవాల రెండు వేలు దాటింది. ఎరువుల ధరలు పెంచారని మంత్రి విమర్శించారు. రైతులకు కేంద్రం చేసిన ఒక్క మంచి పని ఏదైనా ఉందా.. తనిఖీల పేరుతో మిల్లర్లు వడ్లు కొనుగోలు చేయకుండా చేస్తున్నరు. మిల్లుల ముందు లారీలతో ధాన్యం వచ్చాక ఎఫ్. సీ.ఐ అధికారులు మిల్లులో కూర్చోని ఇబ్బంది పెడుతున్నరు. దీన్ని విరమించుకోవాలని, రైతులను ఇబ్బందిపెట్టడం కేంద్రానికి తగదని మంత్రి హరీష్ రావు అన్నారు.

Also Read : త్వరలోనే ప్రభుత్వ ఆస్పత్రుల్లో విస్తృత సేవలు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్