Sunday, September 29, 2024
HomeTrending Newsమిలియన్ మార్చ్ సంగతి తెలియదు: బొత్స

మిలియన్ మార్చ్ సంగతి తెలియదు: బొత్స

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) అమల్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకానికి రూపకల్పన చేసిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం వాస్తవమేనని, అయితే అమల్లో సమస్యలున్నాయని చెప్పారు. తాము ప్రతిపాదించిన కొత్త పథకం సీపీఎస్ ను మించి ఉంటుందని చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించ తలపెట్టిన మిలియన్ మార్చ్ సంగతి తనకు తెలియదని, తమ సమస్యలపై పోరాడే హక్కు అందరికీ ఉంటుందని కానీ సిఎం ఇంటిపై దాడి చేస్తామంటే ఎలా ఊరుకుంటామని ప్రశ్నించారు. గతంలో జరిగిన ఉద్యమాల్లో అరెస్టయిన  ఉపాధ్యాయులకే పోలీసులు నోటీసులు ఇస్తున్నారని వెల్లడించారు.

ఫేస్ రికగ్నేషన్ యాప్ అన్ని శాఖల్లో త్వరలో అమలు చేస్తామని బొత్స పునరుద్ఘాటించారు. ప్రభుత్వ ఇబ్బందులను కూడా ఉద్యోగ సంఘాలు అర్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Also Read : అన్ని శాఖల్లో పేస్ యాప్: బొత్స

RELATED ARTICLES

Most Popular

న్యూస్