Tuesday, November 26, 2024
HomeTrending NewsAP Cabinet: 24న సిఆర్డీఏ పరిధిలో ఇళ్ళ నిర్మాణం ప్రారంభం

AP Cabinet: 24న సిఆర్డీఏ పరిధిలో ఇళ్ళ నిర్మాణం ప్రారంభం

సీఆర్డీఏ పరిధిలో 47 వేల ఇళ్ళ నిర్మాణ  పనులకు జూలై 24 న ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. దీనికి నేడు జరిగిన ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి ఆమోదముద్ర  వేసింది.  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ నేడు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వివరాలను మీడియాకు వెల్లడించారు.  జూలై నెలలో చేపట్టే సంక్షేమ పథకాలు…. 18న జగనన్న తోడు; 21న నేతన్న నేస్తం పథకాల  అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది

కేబినెట్ నిర్ణయాల్లోని ముఖ్యాంశాలు:

  • సున్నా వడ్డీ కింద 1350 కోట్లు, జగనన్న విదేశీ విద్య తదితర పథకాల అమలుకు లబ్ధిదారులకు ఆర్థిక సాయం
  • భూమిలేని నిరుపేదలకు అసైన్డ్ భూమి పై ఆంక్షలు తొలగింపు
  • 54 వేల ఎకరాల అసైన్డ్ భూములు, 9 వేల 62 ఎకరాల లంక భూముల రైతులకు పూర్తి హక్కులు కల్పిస్తూ నిర్ణయం
  • 20 ఏళ్ళు గా హక్కులు లేని అసైన్డ్ భూములు కు హక్కులు
  • 1700 రెవెన్యూ గ్రామాల్లో 1050 ఎకరాల భూమిని స్మశానవాటికలకు ఇవ్వాలని  నిర్ణయం
  • దళితులకు ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కింద ఉన్న భూమికి రిజిస్ట్రేషన్ చార్జీలను మినహాయింపు
  • 22 ఏ లో ఉన్న ఇనాం భూములకు విషయంలోనూ హక్కులు కల్పించేందుకు  ఆమోదం
  • విశ్వ విద్యాలయాల్లో బోధనా సిబ్బందికి ఉద్యోగ విరమణ వయసు 63 నుంచి 65 ఏళ్ళకు పెంపు
  • ఏపీలోని కొత్త 5 మెడికల్ కళాశాల ల్లో 706 పోస్టులు, బోధన కోసం 480 పోస్టుల భర్తీ
  • అన్నమయ్య జిల్లా గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు 482 కోట్లు
  • పోలవరం ప్రాజెక్టు పునరావాసం కోసం ప్రత్యేక ఇంజినీరింగ్ విభాగం ఏర్పాటు- పోస్టుల భర్తీ
  • 8104 కోట్ల పెట్టుబడి తో జిందాల్ న్యూ ఎనర్జీ ప్లాంట్ 1500 మెగావాట్ల సామర్థ్యంతో పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టు
  • రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి లో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం
  • మూలపేట పోర్టు నిర్మాణం కోసం ఏపీ మారిటైమ్ బోర్డు రూ. 3884 కోట్ల రుణాలు
  • ప్రభుత్వ అధీనంలోని దేవాలయాల్లో ఆర్చకులకు ఉద్యోగ విరమణ లేకుండా చట్ట సవరణ
  • కొత్తగా ఏర్పాటు అయిన జిల్లాల్లో 13 డిప్యూటీ కలెక్టర్ పోస్టుల భర్తీ
  • విశాఖ లో భూముల కుంభకోణం పై సీట్ నివేదిక కు ఆమోదం,  మరోమారు ఈ వ్యవహారం పై విచారణకు అనుమతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్