Saturday, September 21, 2024
HomeTrending NewsGovernor: మూడు బిల్లులకు గవర్నర్ ఆమోదం

Governor: మూడు బిల్లులకు గవర్నర్ ఆమోదం

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ వ‌ద్ద గ‌త కొంత కాలంగా వున్న పెండింగ్ బిల్లుల‌కు క‌ద‌లిక వ‌చ్చింది.. మొత్తం 10 బిల్లుల‌లో మూడింటికి ఆమోదముద్ర వేశారు..రెండు బిల్లుల‌ను రాష్ట్ర‌ప‌తి ప‌రిశీల‌న‌కు పంపారు.. మ‌రో రెండు బిల్లుల‌ను ప్ర‌భుత్వానికి తిప్పిపంపారు.. ప్ర‌స్తుతం గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద మ‌రో మూడు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.. కాగా, 2022 సెప్టెంబరు 14 నుంచి 2023 ఫిబ్రవరి 13 మధ్యకాలంలో 10 బిల్లులను రాష్ట్ర ప‌భుత్వం అధికారిక ఆమోదం కోసం గవర్నర్ కు పంపారు. అయితే ఆ బిల్లుల‌పై గ‌వ‌ర్న‌ర్ ఎటువంటి నిర్ణ‌యం తీస‌కోక‌పోవ‌డంతో తెలంగాణ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.. ప్ర‌స్తుతం ఈ పిటిష‌న్ సుప్రీం కోర్టులో విచార‌ణ ద‌శ‌లో ఉంది.. ఈ ద‌శ‌లో గ‌వ‌ర్న‌ర్ బిల్లుల‌పై ఒక నిర్ణయం తీసుకున్నారు.

సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయంగా మార్పు, తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయ బిల్లు, జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయ సవరణ బిల్లులకు ఆమోదం తెలిపినట్టు సమాచారం. ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతిచ్చే  విశ్వవిద్యాలయ చట్ట సవరణ. జీహెచ్ఎంసీ, పురపాలక చట్టాలకు సవరణ, పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ చట్టం, అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్టం, జీఎస్టీ చట్టాలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులకు శాసనసభ ఆమోదం దక్కినా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండిపోయాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్