Saturday, January 18, 2025
HomeTrending Newsపిలిప్పీన్స్‌లో గవర్నర్ హ‌త్య‌

పిలిప్పీన్స్‌లో గవర్నర్ హ‌త్య‌

పిలిప్పీన్స్‌లోని నీగ్రోస్ ఓరియంట‌ల్ గ‌వ‌ర్న‌ర్ రాయ‌ల్ డిగామో హ‌త్య‌కు గుర‌య్యారు. మిలిట‌రీ దుస్తుల్లో వ‌చ్చిన దుండ‌గులు ఆయ‌న్ను కాల్చి చంపారు. కాల్పుల్లో గ‌వ‌ర్న‌ర్‌తో పాటు మ‌రో అయిదుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అజాల్ట్ రైఫిళ్ల‌తో సుమారు ఆరు మంది అటాక్ చేశారు. బుల్లెట్ ప్రూఫ్ దుస్తుల్లో వాళ్లు ఓ ఎస్‌యూవీలో వ‌చ్చారు. పాంప‌లోనా ప‌ట్ట‌ణంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

నీగ్రోస్ ఓరియంట‌ల్ ప్రావిన్సులో రాజ‌కీయ క‌క్ష‌లు ఎక్కువే.గ‌వ‌ర్న‌ర్ డిగామో ఇటీవ‌లే సుప్రీంకోర్టులో కేసు గెలిచారు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యాన్ని స‌వాల్ చేస్తూ కొంద‌రు కోర్టుకు వెళ్లారు. డిగామోపై కాల్పులు జ‌రిపిన త‌ర్వాత ఆరు మంది అక్క‌డ నుంచి వాహ‌నాల్లో పారిపోయారు.

 

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్